విద్యా వాలంటీర్ల ఉద్యోగాలను రెన్యువల్ చేయాలి        ఇందిరాపార్కు వద్ద విద్యా వాలంటీర్లు మహాధర్నా

0 15

హైదరాబాద్  ముచ్చట్లు:

ప్రభుత్వ పాటశాలల్లో పని చేస్తున్న 16 వేల మంది విద్యా వాలంటీర్లకు గత 14 నెలల జీతాలు చెల్లించి,వారి ఉద్యోగాలను రెన్యువల్ చేయాలనీ నేడు హైదరాబాదు ఇందిరాపార్కు వద్ద విద్యా వాలంటీర్లు మహాధర్నా చేపట్టారు. ఈ దీక్షలో అన్ని జిల్లాల నుండి వందలాది మంది విద్యా వాలంటీర్లు వచ్చి పాల్గొన్నారు. జాతీయ బి.సి సంక్షేమ సంఘం అద్యక్షులు ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిధిగా వచ్చి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి నిరుద్యోగ జాక్ చైర్మన్ నీల వెంకటేష్ అద్యక్షత వహించారు.ఈ దీక్షనుద్దేశించి  ఆర్.కృష్ణయ్య ప్రసంగిస్తూ విద్యా వాలంటీర్లకు 14 నెలలుగా జీతాలు ఇవ్వకపోతే కుటుంబాలను ఎలా పోషిస్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి  కరోనా మహమ్మారి ని దృష్టిలో పెట్టుకొని ప్రైవేటు పాటశాలలో పని చేసే  2 లక్షల 20 వేల మంది టీచర్లకు నెలకు 2 వేల రూ. మరియు 25 కిలోల బియ్యం ఇచ్చి ఆదుకున్నారు. కాని ప్రభుత్వ పాటశాలలో పనిచేసే 16 వేల మంది విద్యా వాలింటర్లకు ఎలాంటి సహాయం చేయకపోతే ఎలాయని ప్రశ్నించారు. 2 లక్షల 20 వేల మంది ప్రైవేటు టిచర్లను ఆదుకున్న ముఖ్యమంత్రి – ప్రభుత్వ పాటశాలలో పనిచేసే 16  వేల మంది విద్యా వాలింటర్లను ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు. పైగా వీరు ప్రభుత్వ పాటశాలలో పనిచేస్తూన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి  స్పందించి ఈ వాలింటర్ల కుటుంబాలు ఎదుర్కుంటున్న కష్టాలను గుర్తించి ఆదుకోవాలని కోరారు. .ఈ సమావేశంలో యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చంటి ముదిరాజ్, అనంతయ్య శివ లాల్, కోటిశ్వర్, విష్ణు ప్రియ, అరుణ, రిషి కుమార్,  పగిళ్ళ సతీష్, ఉదయ్,రవి కుమార్, R.చంద్రశేఖర్ గౌడ్, నికిల్  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:The jobs of academic volunteers should be renewed
Mahadharna Educational Volunteers at Indira Park

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page