హెచ్‌సీఏ వివాదం..అజారుద్దీన్‌కు హైకోర్టులో చుక్కెదురు

0 12

హైదరాబాద్‌  ముచ్చట్లు:
హెచ్‌సీఏ వివాదం లో బుధవారం అజారుద్దీన్‌కు తెలంగాణా హైకోర్టులో చుక్కెదురైంది. ఇటీవలే అపెక్స్‌ కౌన్సిల్‌ను రద్దు చేస్తూ అంబుడ్స్‌మెన్‌ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. అంబుడ్స్‌మెన్‌ ఎవరనే దానిపై క్లారిటీ లేకపోవడంతోనే స్టే విధిస్తున్నట్లు తెలిపింది. దీంతోపాటు అపెక్స్‌ కౌన్సిల్‌ స్థానంలో అజహర్‌ నియమించిన కొత్త సభ్యుల నియామకంపైనా హైకోర్టు స్టే విధించింది. కాగా  ఇటీవలే హెచ్‌సీఏలోని అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులు ఏకపక్ష ధోరణిలో వ్యవహరిస్తున్నారని, అక్రమాలకు పాల్పడ్డారంటూ మాజీ అధ్యక్షుడు మహ్మద్‌ అజారుద్దీన్‌ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.\

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

- Advertisement -

Tags:HCA controversy: Azharuddin gets spot in High Court

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page