ఆర్టీసీలో 1000 కోట్ల రచ్చ

0 14

హైదరాబాద్  ముచ్చట్లు:

టీఎస్‌ఆర్టీసీలో రూ.వెయ్యికోట్ల వ్యవహారం ఆసక్తి రేకెత్తిస్తోంది. అధికారుల్లోనే కొందరు ఈ సొమ్ము శాంక్షన్‌ అయ్యిందంటే…మరికొందరు అబ్బే.. అలాంటిదేం లేదంటున్నారు. ఈ డబ్బులొచ్చాయని చెప్తే ఆర్టీసీ కార్మికులకు సంస్థ యాజమాన్యం బకాయి ఉన్న సీసీఎస్‌, ఎస్‌ఆర్‌బీఎస్‌, ఎస్బీటీ రుణాలు చెల్లించమని ఎక్కడ అడుగుతారో అనే ఆందోళన కనిపిస్తున్నది. సీసీఎస్‌పై ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యం కోర్టు ధిక్కరణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అందుకే ఈ రుణ మంజూరీపై యాజమాన్యం దోబూచులాడుతున్నది. పైగా నష్టాలు, డిఫాల్టర్‌ అంటూ మీడియాకు లీకులిస్తూ, కార్మికుల్ని గందరగోళపరుస్తున్నది. అదే సందర్భంలో ప్రభుత్వ గ్యారెంటీతో ఇస్తున్న ఈ రుణం విడతలవారీగా విడుదల అవుతుం దనీ, అందువల్లే తార్నాక ఆర్టీసీ ఆస్పత్రి పనులు నత్తనడకన నడుస్తున్నాయనీ ప్రచారం చేస్తు న్నది.

- Advertisement -

ఇంతకీ అసలు ఈరుణం మంజూరీ అయ్యిందా లేదా అనే దానిపై యాజమాన్యం మాత్రం ఎలాంటి స్పష్టతా ఇవ్వట్లేదు. ఈ గంద రగోళాన్ని ఇలాగే కొనసాగించాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్‌కు ప్రగతిభవన్‌ నుంచి ఆదేశాలు అందాయనే ప్రచారమూ జరుగుతున్నది. ఆర్టీసీపై రవాణాశాఖ మంత్రి స్వతంత్రించి నిర్ణయాలు తీసుకొనే పరిస్థితుల్లో లేరని ఇప్పటికే పలు సందర్భాల్లో కార్మిక సంఘాలు విమర్శలు చేశాయి. వాటిని సదరు మంత్రి కూడా పట్టించుకోనట్టే వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం వివిధ ప్రభుత్వ, ప్రయివేటు రుణ సంస్థల నుంచి రూ.1,700 కోట్లు మాత్రమే అప్పుగా తీసుకున్నది. దీనిలో రూ.1,300 కోట్లు సంస్థ నేరుగా తీసుకున్నవి కాగా, మరో రూ.400 కోట్లు ప్రభుత్వ గ్యారెంటీ రుణాలు ఉన్నాయి. వీటన్నింటినీ యాజమాన్యం క్రమం తప్పకుండా చెల్లిస్తూనే ఉన్నది. కాకపోతే ఆర్టీసీ యాజమాన్యం చెల్లించని రుణాలు పూర్తిగా కార్మికులకు సంబంధినవే కావడం గమనార్హం.

ఆర్టీసీ యాజమాన్యం స్వయంగా నిర్వహిస్తున్న కార్మికుల భవిష్యనిధి (పీఎఫ్‌) సొమ్ము రూ.1,400 కోట్లను సొంతానికి వాడేసుకుంది. దాన్ని చెల్లించట్లేదు. అలాగే ఆర్టీసీ కార్మికులకు చెందిన క్రెడిట్‌ కోపరేటివ్‌ సొసైటీ (సీసీఎస్‌) సొమ్ము రూ.1,100 కోట్లు, స్టాఫ్‌ రిటైర్‌మెంట్‌ బెనిఫిట్‌ స్కీం (ఎస్‌ఆర్‌బీఎస్‌) నుంచి వాడుకున్న రూ.387 కోట్లు, స్టాఫ్‌ బిన్వలెంట్‌ ట్రస్ట్‌ (ఎస్బీటీ) నుంచి రూ.125 కోట్లతో సహా మొత్తంగా కార్మికులు దాచుకున్న రూ.3,012 కోట్లను యాజమాన్యం వాడేసుకుంది. వీటినీ చెల్లించట్లేదు. బయటి నుంచి తెచ్చుకున్న రుణాలను మాత్రం క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారు. కార్మికుల సొమ్ము రూ.3,012 కోట్లు, వివిధ ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రూ.1,700 కోట్లు మొత్తం కలిపి సంస్థపై ఉన్న అప్పుల భారం రూ.4,712 కోట్లు. రూ. వెయ్యి కోట్ల ప్రభుత్వ గ్యారెంటీ రుణం వచ్చిందని తెలిస్తే, కార్మికుల నుంచి ఒత్తిడి వస్తుందనే ఈ ఇష్యూని ఇలాగే గందరగోళంలో ఉంచమని ప్రగతిభవన్‌ నుంచి ఆదేశాలు ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ వ్యవహారమంతా కేవలం కార్మికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు చేస్తున్న ప్రయత్నమేననే ప్రచారం జరుగుతున్నది.ఆర్టీసీ అప్పుల్లో ఉందనడం శుద్ధ అబద్ధం. జాతీయ బ్యాంకులు, ఇతర ప్రయివేటు ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాల వాయిదాలన్నీ సక్రమంగానే చెల్లిస్తున్నారు. వారి దగ్గర తీసుకున్న రుణా లకంటే అధికంగా కార్మికుల నుంచి రూ.3 వేల కోట్లకుపైగా అప్పు చేశారు. వీటిని మాత్రమే చెల్లిం చట్లేదు. బుక్‌ అడ్జెస్ట్‌మెంట్లు మాత్రమే చేస్తున్నారు. పీఎఫ్‌ కమిషనర్‌ ఇప్పటికే పలుమార్లు యాజ మాన్యానికి నోటీసులు ఇచ్చారు. సీసీఎస్‌ సొమ్ముపై కోర్టు ధిక్కరణ ఎదుర్కొంటున్నారు. అసలు ఆర్టీసీ నిర్వహణే అసమర్థంగా ఉంది. ప్రభుత్వ గ్యారెంటీ రూ.వెయ్యికోట్ల రుణంపై యాజమాన్యం ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. ఆ సొమ్మును దేనికోసం ఖర్చు చేస్తారో చెప్పాలి. కార్మికుల సొమ్మును తక్షణం చెల్లించాలి.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:1000 crore in RTC

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page