ఎవర్ గివెన్ కు 92 కోట్ల నష్ట పరిహారం

0 7

న్యూఢిల్లీముచ్చట్లు:
సూయజ్ కాలువకు అడ్డంగా చిక్కుకుని రూ. వేల కోట్ల నష్టం కలిగించిన ‘ఎవర్ గివెన్’ నౌక ఎట్టకేలకు ప్రయాణం ప్రారంభించింది. దాదాపు నాలుగు నెలల అనంతరం ప్రయాణం ప్రారంభం కాగా.. నౌక వీడ్కోలు కార్యక్రమానికి వివిధ దేశాల ప్రతినిధులు, దౌత్యవేత్తలు, కంపెనీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సూయజ్ కెనాల్ అథారిటీ (ఎస్ఏఏ) ఆతిథ్యమిచ్చింది. చివరిసారిగా 2015లో కాల్వ విస్తరణ ప్రాజెక్టును పూర్తిచేసినప్పుడు ఇంతటి ఘనంగా అథారిటీ వేడుక నిర్వహించిందినష్టపరిహారం ఇవ్వనిదే నౌకను విడుదల చేయమని సూయజ్ కెనాల్ అథారిటీ స్పష్టం చేయడంతో మార్చి నెల నుంచి ఈ నౌక అక్కడే ఆగిపోయింది. అయితే, ఈ విషయంలో నౌక యాజమాన్యం, బీమా సంస్థలు అవగాహనకు రావడంతో ఎవర్ గివెన్ నౌక సూయజ్ కాలువ నుంచి కదలడానికి కెనాల్ అథారిటీ నుంచి అనుమతి లభించింది. ఈ ఏడాది మార్చిలో ఎవర్‌ గివెన్‌ సూయజ్ కాలువలో అడ్డంగా చిక్కుకపోవడంతో కొన్ని రోజులపాటు రవాణా ఆగిపోయింది. రోజుకు దాదాపు రూ.70 వేల కోట్ల నష్టం వచ్చినట్లు అంచనా వేశారు.వారం రోజుల పాటు శ్రమించి ఈ నౌకను కదిలించారు.

ఈ నౌక సూయజ్‌ కాలువలో ఆగిపోవడం వల్ల జల రవాణాకు ఆటంకం కలిగిందని, దానికి నష్టపరిహారం చెల్లిస్తేనే కదలనిస్తామని ఎస్‌సీఏ స్పష్టం చేసింది. నష్ట పరిహారం కోరుతో సూయజ్‌ కెనాల్‌ అథారిటీ ఈజిప్టు కోర్టులో దావా వేసింది. 91.6 కోట్ల అమెరికన్‌ డాలర్ల పరిహారం చెల్లించాలని కోరింది. అనంతరం ఆ మొత్తాన్ని 55 కోట్ల అమెరికన్‌ డాలర్లకు తగ్గించింది.అయితే, నష్టపరిహారం ఎవరు చెల్లించాలనే విషయంలో ఎవర్‌ గివెన్‌ నౌక యజమాన్యం షోయి కిసెన్‌, బీమా కంపెనీలు కోర్టును ఆశ్రయించాయి. మూడు నెలల వివాదం తర్వాత ఎట్టకేలకు నౌక యాజమాన్య సంస్థ, బీమా కంపెనీల మధ్య గత ఆదివారం ఓ ఒప్పందం కుదిరింది. దాంతో ఈ నౌక సూయజ్‌ కాలువ నుంచి కదిలేందుకు కెనాల్‌ అథారిటీ నుంచి అనుమతి లభించింది.

- Advertisement -

బుధవారం పరిహార ఒప్పందాలపై సంతకాలు జరగడంతోఎంత పరిహారానికి ఒప్పందం కుదిరిందనే విషయాన్ని మాత్రం బహిర్గతం కాలేదు. ఈ ఒప్పందంలో భాగంగా 75 టన్నుల సామర్థ్యంగల ఒక టగ్‌బోట్‌ మాత్రం సూయజ్‌ కెనాల్‌ అథారిటీకి వస్తుందని ఎస్‌సీఏ ఛైర్మన్‌ ఒసామా రబీ పేర్కొన్నారు. ఒప్పందం నిబంధనలను గోప్యంగా ఉంచడానికి ఎస్‌సీఏ కట్టుబడి ఉందని అథారిటీ తరపు న్యాయవాది ఖలీద్ అబూబకర్ అన్నారు.నౌకా నిర్వహణ సంస్థ చీఫ్ యుకిటో హిగాకి.. సూయజ్ కెనాల్ అథారిటీకి కృతజ్ఞతలు తెలిపారు. ‘మా కంపెనీకి పెద్ద సంఖ్యలో ఓడలు ఉన్నాయి.. సూయజ్ కాలు సాధారణ, నమ్మకమైన కస్టమర్లగా కొనసాగుతాం.. ఇది మా దృష్టిలో అంతర్జాతీయ జల వాణిజ్యానికి ఒక అనివార్యమైన ఆస్తిగా మిగిలిపోయింది’ అని వ్యాఖ్యానించారు.ప్రపంచ జల రవాణాలో 15 శాతం సూయజ్ కాలువ ద్వారా జరుగుతోంది. ‘ఈ ఘటనపై విచారణ లోతుగా జరిగి పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది.. కానీ, ఎవర్ గివెన్ మళ్లీ ప్రయాణం మొదలుపెట్టడం సంతోషంగా ఉంది’ అని ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ షిప్పింగ్ సెక్రటరీ జనరల్ గై ప్లాటెన్ అన్నారు. ‘ఎవర్ గివెన్ సంఘటన ప్రపంచ సరఫరా గొలుసుకు రవాణా ప్రాముఖ్యత, ప్రతి ఏడాది 14 ట్రిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యానికి మద్దతు ఇవ్వడంలో నౌకాదళం కీలక పాత్రపై వెలుగునిస్తుంది’ అని వివరించారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:92 crore compensation to Ever Given

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page