ఒక్క ఎమ్మెల్యే గెలిస్తేనే ఎగెరెగిరి పడ్డారు : కేటీఆర్

0 4

బీజేపీపై కేటిఆర్ విమర్శలు
హైదరాబాద్  ముచ్చట్లు:
తెలంగాణ‌లో టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్‌ను ఎదుర్కొనే శ‌క్తి ఎవ‌రికీ లేదు అని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. సింగ‌రేణి కోల్‌మైన్స్ బీఎంఎస్ అధ్య‌క్షుడు కెంగ‌ర్ల మ‌ల్ల‌య్య టీఆర్ఎస్ పార్టీలో చేరిన సంద‌ర్భంగా.. తెలంగాణ భ‌వ‌న్‌లో కేటీఆర్ ప్ర‌సంగించారు.ఇవాళ రాష్ర్టంలో కొంత‌మంది కొత్త‌బిచ్చ‌గాళ్లు వ‌చ్చారు.. నిన్న మొన్న ప‌ద‌వులు వ‌చ్చినోళ్లు ఎగిరెగిరి ప‌డుతున్నారు అని కేటీఆర్ పేర్కొన్నారు. పెద్ద‌పెద్ద మాట‌లు మాట్లాడుతున్నారు. ఒకాయ‌న గుంజుకోవాలంటాడు. ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నారు. కేసీఆర్‌ను తిడితేనే పెద్ద నాయ‌కుల‌మైపోతామ‌నే చిల్ల‌ర ఆలోచ‌నా విధానాన్ని మానుకోవాల‌ని కేటీఆర్ సూచించారు. కేసీఆర్‌ను గెల‌వాలంటే.. కేసీఆర్ కంటే ఎక్కువ‌గా తెలంగాణ‌ను ప్రేమించడం నేర్చుకోవాలి. కేసీఆర్ కంటే ఎక్కువ తెలంగాణ‌కు ఏమ‌న్న చేయ‌గ‌ల‌మ‌న్న విశ్వాసాన్ని క‌ల్పిస్తే.. ఏదో రెండు ఓట్లు రాలుతాయి. త‌ప్ప ఏం సాధించ‌లేరు. కేసీఆర్‌ను తిట్టంగ‌నే ఒక శున‌కానందం, పైశాచిక ఆనందం పొంద‌డం తాత్కాలిక‌మేన‌ని కేటీఆర్ అన్నారు.మీరు త‌ల‌ప‌డుతున్న‌ది ఆషామాషీ నాయ‌కుడితో కాదు.. నిర్విరామంగా పోరాటం చేసి, కేంద్రం మెడ‌లు వంచి తెలంగాణ‌ను సాధించిన నాయ‌కుడితో పోరాడుతున్నారు అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్ర‌యోజ‌నాల విష‌యంలో వైఎస్సార్, చంద్ర‌బాబు, కిర‌ణ్ కుమార్‌రెడ్డితో పాటు పులువ‌రిపై ధీరోధాత్తంగా కేసీఆర్ పోరాడారు.

 

జాతీయ స్థాయిలో రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ను ఏకం చేసి తెలంగాణ‌ను కేసీఆర్ తీసుకొచ్చారు అని కేటీఆర్ గుర్తు చేశారు.ఓటుకు నోటు కేసులో చంచ‌ల్‌గూడ జైలుకు వెళ్లిన రేవంత్.. మ‌ళ్లీ అవే నోట్ల క‌ట్ట‌ల‌తో పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి కొనుక్కున్నాడ‌ని కాంగ్రెస్ పార్టీ ఎంపీలే అంటున్నారు అని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ నుంచి తెలంగాణ‌ను గుంజుక‌కోవడం సాధ్యం కాదు. కేసీఆర్ పేరు ఉచ్చ‌రించే అర్హ‌త కూడా లేదు. టీఆర్ఎస్ లేక‌పోతే టీ బీజేపీ, టీ కాంగ్రెస్ వ‌చ్చేవా? అని ప్ర‌శ్నించారు. వీళ్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉంటే గంజిలో ఈగ లాగా తీసి అవ‌త‌ల ప‌డేద్దురు. కోతికి కొబ్బ‌రిచిప్ప దొరికిన‌ట్టు.. గింతంతా ప‌ద‌వి దొరికింది. ఆ ప‌ద‌వికి ప్ర‌క‌ట‌న‌లు, ర్యాలీలు తీసిండ్రు.. అవ‌న్నీ చేసుక్కో.. కానీ పిచ్చి పిచ్చి మాట‌లు మాట్లాడొద్ద‌ని రేవంత్‌ను హెచ్చ‌రించారు. రాజ్యాంగంలోని ప‌దో షెడ్యూల్ ప్ర‌కారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మ‌రి టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన‌ప్పుడు ఎందుకు రాజీనామా చేయ‌లేదు అని రేవంత్‌ను ప్ర‌శ్నించారు. రాజ‌స్థాన్‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు రాజ్యాంగ‌బ‌ద్ధంగా చేరారు. మ‌రి రాళ్ల‌దాడి వారిపై కూడా చేయాలా? రాజీనామా చేయ‌ని మిమ్మ‌ల్ని కూడా రాళ్ల‌తో కొట్టాల్నా? బ‌జారు భాష మాట్లాడే నాయ‌కుల‌ను ప‌ట్టించుకునే అవ‌స‌రం మ‌న‌కు లేద‌ని కేటీఆర్ అన్నారు.భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కులు దుబ్బాక‌లో, జీహెచ్ఎంసీలో నాలుగు సీట్లు ఎక్కువ గెల‌వంగానే ఎగిరెగిరి ప‌డ్డారు. ఆ త‌ర్వాత జ‌రిగిన సాగ‌ర్ ఉప ఎన్నిక‌లో, ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీజేపీ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీజేపీ త‌న సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఆ త‌ర్వాత జ‌రిగిన మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లోనూ బీజేపీ ఓట‌మి పాలైంది. అన్ని ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించి, రాష్ర్ట ప్ర‌జ‌లు కేసీఆర్‌పై త‌మ‌కున్న అభిమానాన్ని చూపించారు. ఈ రాష్ర్టం అభివృద్ధి చెందాలంటే కేవ‌లం కేసీఆర్‌తోనే సాధ్య‌మ‌వుతుంద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

- Advertisement -

పాదయాత్రల సీజన్
స్తుతం తెలంగాణలో పాదయాత్రల సీజన్‌ మొదలైందని, అలా ప్రజల వద్దకు వెళ్తే అక్కడ అభివృద్ధి చూడాలని రాష్ట్ర ఐటీ శాఖమంత్రి కె.తారక రామారావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘సోనియాను తెలంగాణ తల్లి అంటున్న రేవంత్‌ రెడ్డి గతంలో బలిదేవత అన్నాడు.. రేపు చంద్రబాబును తెలంగాణ తండ్రి అని కూడా అంటాడేమోనని’ వ్యంగాస్త్రాలు సంధించారు. రేవంత్‌రెడ్డిలో ఇంకా టీడీపీ వాసన పోలేదని ధ్వజమెత్తారు.  ఎవరిని దేంతో కొట్టాలో తెలంగాణ ప్రజలకు ఆయన తెలుసన్నారు.
మల్లయ్యకు సముచిత స్థానం

సింగ‌రేణి బీఎంఎస్ అధ్య‌క్షుడు కెంగర్ల మ‌ల్ల‌య్య తిరిగి సొంత‌గూటికి చేరుకోవ‌డం సంతోషంగా ఉంద‌ని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో త‌న అనుచరుల‌తో క‌లిసి మ‌ల్ల‌య్య టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సింగ‌రేణి కార్మికుల‌కు ఏ హామీలు అయితే ఇవ్వ‌డం జ‌రిగిందో.. అన్నింటినీ నెర‌వేర్చిన ఘ‌న‌త సీఎం కేసీఆర్‌కే ద‌క్కుతుంద‌న్నారు. ఏడు సంవ‌త్స‌రాలుగా ప్ర‌తి కార్మికుడికి లాభం చేయ‌డం జ‌రిగింద‌న్నారు. న్యాయ‌ప‌ర‌మైన చిక్కుల‌ను సావ‌ధానంగా ప‌రిష్క‌రించుకుందామ‌ని తెలిపారు.13 నుంచి 14 నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌త్య‌క్షంగా, మ‌రో 15 నుంచి 20 నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రోక్షంగా సింగ‌రేణి కార్మికుల పాత్ర ఉంటుంద‌ని తెలిపారు. ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో సింగ‌రేణి కార్మికులు టీఆర్ఎస్ పార్టీతో క‌లిసి క్రియాశీల‌కంగా ప‌ని చేయాల‌న్నారు. కెంగ‌ర్ల మ‌ల్ల‌య్య‌కు పార్టీలో స‌ముచిత స్థానం క‌ల్పిస్తామ‌న్నారు. మ‌నం క‌లిసిక‌ట్టుగా ఉంటే.. ఇత‌ర సంఘాల‌కు, పార్టీల‌కు నూక‌లు చెల్ల‌వు అని స్ప‌ష్టం చేశారు. కార్మికులంద‌రూ ఏక‌ప‌క్షంగా ఉండాల‌ని సూచించారు. సింగ‌రేణి ప్రాంతంలో ఉండే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా కార్మికుల‌తో క‌లిసిపోవాల‌న్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:If only one MLA wins, he will fall: KTR

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page