కన్నా.. ఫ్యూచరేంటో…

0 10

గుంటూరు  ముచ్చట్లు:

కేంద్ర మంత్రి వర్గ ప్రక్షాళన దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో ఎనిమిది రాష్ట్రాల గవర్నర్ల మార్పులు.. చేర్పులు ప్రక్రియ చేపట్టారు. ఈ క్రమంలోనే ఎవ్వరూ ఊహించని విధంగా ముందుగా లీకులు కూడా లేకుండానే ఏపీకి చెందిన కంభంపాటి హరిబాబుకు మిజోరం గవర్నర్ పదవి కేటాయించారు. అలాగే మరో తెలుగు వ్యక్తి.. తెలంగాణకు చెందిన కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ స్థానచలనం కలిగింది. ఇప్పటికే కేంద్ర మంత్రి వ‌ర్గంలో ఉన్న థావర్‌చంద్ గెహ్లాట్‌ను క‌ర్నాట‌క గ‌వ‌ర్నర్‌గా నియ‌మించ‌డం గ‌మనార్హం. వాస్తవంగా చెప్పాలంటే 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీలో బీజేపీకి చెందిన ఓ వ్యక్తి కి ఇంత పెద్ద ప‌ద‌వి రావడం ఇదే మొదటిసారి.ఏపీ బీజేపీలో గ‌త ఏడెనిమిది సంవత్సరాలుగా ఎంతో మంది పదవులు ఆశిస్తున్నారు.

 

- Advertisement -

సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ లాంటి వాళ్లు గత ఎన్నికల్లో బిజెపి గెలిచిన తర్వాత కానీ పార్టీలో చేరలేదు. వీరి సంగ‌తి కాసేపు పక్కన పెడితే కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి ఇలాంటి వాళ్లు 2014 ఎన్నికలకు ముందే కేంద్ర మంత్రి హోదాలో ఉండి మరి బీజేపీలో చేరారు. వాళ్లను కూడా బిజెపి జాతీయ నాయకత్వం పట్టించుకోవడం లేదు. వాళ్లకు పార్టీ పదవులు ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. ఒక రాజ్యసభ లేదా కేంద్ర సహాయ మంత్రి పదవి కానీ ఇచ్చేందుకు ఎంత మాత్రం ఇష్టపడటం లేదు. పార్టీలో ఎన్నో ఏళ్లుగా క‌మిట్‌మెంట్‌తో ప‌ని చేస్తోన్న కంభంపాటి హరిబాబుకు ఈ పదవి వచ్చేందుకు కూడా ఏడు సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది.ఇక ఇప్పుడు పురందేశ్వరి, క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ లాంటి వాళ్ల ప‌రిస్థితి ఏంట‌న్నదే ప్రశ్నార్థకంగా మారింది.

 

క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యి.. అన్ని ఏర్పాట్లు చేసుకుని మ‌రీ బీజేపీలోకి వెళ్లారు. ఫ‌లితంగానే ఆయ‌న‌కు ఏపీ బీజేపీ ప‌గ్గాలు వ‌చ్చాయి. న‌ర‌సారావుపేట నుంచి బీజేపీ త‌ర‌పున పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఎంపీగా పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. ఆ త‌ర్వాత ఆయ‌న ప‌ద‌వి, ప‌నితీరు విష‌యంలో ఏ మాత్రం సంతృప్తిగా లేని బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం ఆయ‌న్ను ఏపీ బీజేపీ బాధ్యత‌ల నుంచి కూడా త‌ప్పించేసింది. టీడీపీతో లాలూచీ ప‌డుతున్నార‌న్న ఆరోప‌ణ‌లు కూడా ఆయ‌న ప‌ద‌వి ఊస్టింగ్‌కు ఓ కార‌ణం.అప్ప‌టి నుంచి క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ త‌న‌కు ఏదో ఒక ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఆశ‌ల ప‌ల్లకీలో మునిగి తేలుతూనే ఉన్నారు. క‌న్నా రాజ్యస‌భ కోసం రెండు మూడు సార్లు లాబీయింగ్ చేశారు. మ‌ధ్యలో పార్టీ మార‌తాన‌ని ప‌రోక్ష హెచ్చరిక‌లు, బెదిరింపులు కూడా చేశారు. అయితే ఇవేవీ బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం ప‌ట్టించుకోలేదు స‌రిక‌దా ? క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణను లైట్ తీస్కొంది. చివ‌రకు క‌న్నా బీజేపీలో ఉన్నా ప‌ద‌వులు రావ‌డం లేదు… పార్టీ మారినా ఆయ‌న్ను ఎవ్వరూ గౌర‌వించే ప‌రిస్థితి లేదు. ఈ క్రమంలోనే ఏదో ఒక ప‌ద‌వి ఎప్పుడో క‌ప్పుడు వ‌స్తుంద‌ని క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ కాలం వెళ్లదీయ‌డం త‌ప్పా ఇప్పట్లో చేసేదేం లేదు. క‌న్నా కంటే ముందే పురందేశ్వరికి ఏదో ఒక ప‌ద‌వి వ‌చ్చే అవ‌కాశాలే ఎక్కువ.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

 

Tags:Than .. Futurento …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page