గోస్పడు మండలం లో 3కోట్ల  అభివృద్ధి పనులు ప్రారంభించిన యమ్ యల్ ఏ

0 6

నంద్యాల  ముచ్చట్లు:

మీరు చూపిన బాట‌లో.. మీ అడుగు జాడ‌ల్లో
మీ ఆశ‌య సాధ‌న కోసం..మా ప్ర‌యాణం
దివంగ‌త  డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి  జ‌యంతి,  రైతు దినోత్సవం సంద‌ర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ నంద్యాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి. ఈ సందర్భంగా నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గంలోని గోస్పాడు మండలంలో దీభగుంట్ల గ్రామంలో రైతు దినోత్సవం  అలాగే డాక్టర్ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా గ్రామంలో కోటి ఇరవై లక్షల రూపాయలతో వైయస్సార్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కు భూమి పూజ నిర్వహించారు. అలాగే రైతు భరోసా కేంద్రాన్ని 22 లక్షల రూపాయలతో నేడు ప్రారంభించడం జరిగింది. అలాగే 25 పొదుపు గ్రూపులకు 1కోటి 11 లక్షల రూపాయల ను మహిళలకు అందజేయడం జరిగిందన్నారు. మండలంలోని డప్పు కళాకారులకు 55 మందికి డప్పు గజ్జెలు పంచె  అందించారు . కానాల పల్లె గ్రామంలోని అభ్యుదయ రైతులకు అగ్రికల్చర్ ఆధ్వర్యంలో పవర్ స్పేర్ లను అందజేశామన్నారు.
అలాగే నెహ్రు నగర్ లో రైతు భరోసా కేంద్రం వైయస్సార్ హెల్త్ సెంటర్ ను 40 లక్షల రూపాయలతో నిర్మించి ప్రారంభించడం జరిగిందన్నారు. ఏ ముఖ్యమంత్రి   చేయని విధంగా అబివృద్ది  చేస్తున్న ఏకైక  ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో రైతులను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందని వైఎస్ హయాంలో రైతులకు అండగా ఉండి రైతు పండగ చేసుకునే విధంగా అభివృద్ధి చేశారని తెలిపారు. అదే బాటలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం అహర్నిశలు కష్టపడుతూ వారి అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్నారన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:Yam Yal A who started 3 crore development works in Gospadu zone

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page