ఢిల్లీలో అనాధాశ్రమంలో  వైఎస్‌ జయంతి వేడుకలు అనాధ బాలురు, మహిళలకు అన్నదానం, వస్త్ర దానం

0 13

న్యూఢిల్లీ ముచ్చట్లు:
దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 72వ జయంతిని పురస్కరించుకుని ఈరోజు ఢిల్లీలోని బాల్ సహయోగ్‌లో అనాధ బాలలు, మహిళల సమక్షంలో జన్నదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ నాయకులు శ్రీ వి.విజయసాయి రెడ్డి, పార్టీ లోక్‌ సభాపక్ష నాయకులు శ్రీ పీవీ మిధున్‌ రెడ్డి, లోక్‌ సభలో పార్టీ విప్‌ శ్రీ మార్గాని భరత్‌ జ్యోతి ప్రజ్వల చేసి ప్రారంభించారు. అనంతరం వారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డికి పుష్పాంజలి ఘటించారు.
శ్రీ వైఎస్‌ 72వ జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేయించిన కేక్‌ను శ్రీ విజయసాయి రెడ్డి బాల్‌ సహయోగ్‌లోని అనాధ చిన్నారుల చేత కట్‌ చేయించారు. అనంతరం అనాధ బాలురు, మహిళలకు నూతన వస్త్రాలు, చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా దివంగత శ్రీ వైఎస్‌ రాజశేఖర రెడ్డి పేదల అభ్యున్నతి కోసం చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు దేశ చరిత్రలో ఒక అధ్యాయంగా మిగిలిపోయాయని అన్నారు. సంక్షేమానికి ఆయన కొత్త నిర్వచనం చెప్పారని అన్నారు. నిరు పేదలు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, అభ్యున్నతి కోసం శ్రీ వైఎస్‌ నిరంతరం తాపత్రయపడుతుండేవారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తన తండ్రి బాటలోనే పయనిస్తూ ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నారని అన్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

- Advertisement -

Tags:

YS Jayanti celebrations at an orphanage in Delhi

Donation of food and clothing to orphaned boys and women

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page