తుగ్గలి మండల తహశీల్దార్ గా నజ్మా భాను భాద్యతలు స్వీకరణ

0 20

తుగ్గలి           ముచ్చట్లు:
తుగ్గలి మండల తహసీల్దార్ గా నజ్మా భాను గురువారం రోజున భాద్యతలు స్వీకరించారు.ఆమె ఇంతకు ముందు షెట్కూరు సీఈఓగా పదవీ బాధ్యతలు నిర్వహించే వారని, ప్రమోషన్ పై తుగ్గలి మండల రెవిన్యూ అధికారి గా రావడం జరిగిందని ఆమె విలేకరుల తెలిపారు.భాద్యతలు స్వీకరించిన తహసీల్దార్ నజ్మా భానుకు  ఇన్ఛార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న డిప్యూటీ  తహసీల్దార్ నిజాముద్దీన్ వారి సిబ్బంది ఆమెకు స్వాగతం పలికి,పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ తాము ఈ ప్రాంతానికి కొత్తగా వచ్చానని మీ అందరి సహాయ సహకారాలు తమకు అందించి,మండలంలో ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకుని వచ్చి పరిష్కరించడానికి మీ అందరి సహకారం కావాలని ఆమె తన సిబ్బందిని కోరారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ సుధాకర్ రెడ్డి,మండల సర్వేయర్ గాదిలింగప్ప,జూనియర్ అసిస్టెంట్ రంగస్వామి,డైరెక్ట్ రెక్రూట్ వీఆర్వోల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర,కాశీ రంగస్వామి, మండల అధ్యక్షులు వెంకట్రాముడు,కృష్ణారెడ్డి, బాలవర్ధిరాజు,వెంకన్న,రామాంజనేయులు, రామలింగప్ప,నాగ లక్ష్మీ,మండలంలోని వీఆర్ఏలు,రెవిన్యూ సిబ్బంది ఆమెకు స్వాగతం పలికి,శుభాకాంక్షలు తెలియజేసారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

- Advertisement -

Taga:Najma Bhanu assumes responsibilities as Tahsildar of Thuggali Mandal

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page