పేదల గుండెల్లో చిరస్మరణీయుడు వైఎస్‌ఆర్‌

0 27

చౌడేపల్లె ముచ్చట్లు:

- Advertisement -

పేద ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడుగా దివంగత ముఖ్యమంత్రి,మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చెరగని ముద్రవేసుకొన్నరని మండల సర్పంచుల సంఘ ్యధ్యక్షురాలు జయసుధమ్మ నాగభూషణరెడ్డి పేర్కొన్నారు. గురువారం పెద్దకొండామర్రిలో 72 జయంతి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. మహానేత కాంస్య విగ్రహానికి పూల మాలవేసి వైఎస్‌ఆర్‌ అమర్‌రహే అంటూ నినాదాలు చేశారు.పేదగుండెలకు రక్షణగా నేనున్నానంటూ అమలుచేసిన సంక్షేమపథకాలు పధిలం అంటూ పలువురు వక్తలు కొనియాడారు. అదే ఆశయంతోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తూ అండగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శిసుకుమార్‌, విఆర్వో గుర్రప్పసచివాలయ సిబ్బంది, నవీన్‌,హరిత, మోహన్‌, వెంకటరమణ, గ్రామస్తులు నాగభూషణరెడ్డి,జయరామిరెడ్డి, తదితరులున్నారు.

 

గ్రామీణరైతుల ముంగిటకే ప్రభుత్వ సేవలు- మంత్రి పెద్దిరెడ్డి వెల్లడి

 

Tags: YSR is memorable in the hearts of the poor

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page