పోలీస్ స్టేషన్ లో ట్రాక్టర్లు…?

0 29

వరంగల్  ముచ్చట్లు:
అన్ని స్టేషన్ల లాగే అది కూడా ఓ పోలీసు స్టేషన్. కానీ ఉన్నట్టుండి సోమవారం అర్ధరాత్రి నుంచి తెల్లారేసరికి సదరు స్టేష‌న్‌లో ట్రాక్టర్ల జాతర సాగింది. దాదాపు 50కి పైగా ట్రాక్టర్లు స్టేషన్ ఆవరణలో నిండిపోయాయి. బయటి నుంచి చూస్తున్న వారికి ఏం జరుగుతుందో అర్ధంకాని పరిస్థితి. ఇంతకీ అక్కడ ఏం జరిగింది..? ఎక్కడ ఆ పోలీసు స్టేషన్ అనుకుంటున్నారా.. మరేంలేదండి. అది నల్లగొండ జిల్లా కేతేపల్లి పోలీసు స్టేషన్. అక్కడ జరిగిన ట్రాక్టర్ల జాతర మరేంటో కాదు.. అక్రమంగా ఇసుక రవాణాలో పట్టుబడిన ట్రాక్టర్లు. ఒక్కసారిగా ఇంత భారీ స్థాయిలో ఇసుక అక్రమ రవాణలో ట్రాక్టర్లు పట్టుబడడం కలకలం రేపిందికేతేపల్లి మండలంలోని భీమారం శివారులోని మూసీ నది నుంచి గత కొన్నేండ్లుగా అక్రమ ఇసుక రవాణా జరుగుతుంది.

 

అడపాదడపా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పోలీసులు పట్టుకోవడం.. రాజకీయ నేతల ప్రమేయంతో వదిలేయడం ఇక్కడ సర్వసాధారణమే. నిత్యం మూసీ నది నుంచి ఒక్క భీమారం గ్రామ పరిధిలోనే వందల ట్రాక్టర్ల ఇసుక తరలుతుంది. దీనిపై ఎవరూ ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. ఏనాడూ పట్టించుకోలేదు. కానీ ఇసుక అక్రమ రవాణాపై జిల్లా పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో కేతేపల్లి పోలీసులు మెరుపు దాడులు చేసి దాదాపు 50కు పైగా ఇసుక ట్రాక్టర్లను పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆ ప్రాంతమంతా ట్రాక్టర్ల జాతరను తలపించింది.వాస్తవానికి భీమారం గ్రామంతో పాటు పక్కనే ఉన్న కొప్పోలు, ఉప్పలపహాడ్ గ్రామాల్లో కేవలం ఇసుక రవాణా కోసమే వందలాది ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. ఒక్కో గ్రామంలో సగటున 100 ట్రాక్టర్లు ఉంటాయి. ఇక్కడి స్థానిక ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే ఇసుక దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోందనే ఆరోపణలు లేకపోలేదు. ఇదిలావుంటే.. భీమారం, కొప్పోలు తదితర గ్రామాలకు చెందిన ట్రాక్టర్లన్నీ ఇసుక అక్రమ రవాణా కేసులో పోలీసు స్టేషన్‌లో ఇరుక్కుపోవడంతో వ్యవసాయ పనులు సాగక రైతాంగం మస్తు తిప్పలు పడుతోంది. వానాకాలం సీజన్ ముమ్మరంగా సాగుతోన్న సమయంలో ట్రాక్టర్లు పోలీసు స్టేషన్‌లో ఇరుక్కుపోవడంతో సాగు పనులు ముందుకు సాగడం లేదు. తాజాగా పోలీసుల చర్యలతో ట్రాక్టర్ల యాజమాన్యాలు ఇసుక అక్రమ రవాణాను నిలిపేస్తాయా.. లేక మళ్లీ అలాగే కొనసాగిస్తాయో వేచిచూడాల్సిందే.

 

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Tractors in the police station …?

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page