మాకు పదవి ఇవ్వకపోతే… తడాఖా చూపిస్తాం, నిషద్ ఆగ్రహం

0 6

లక్నో    ముచ్చట్లు:
కేంద్ర క్యాబినెట్‌ను విస్తరించిన ప్రధాని నరేంద్ర మోదీ.. కొత్తగా 43 మందికి చోటు కల్పించారు. వచ్చే ఏడాది ఎన్నికల జరగబోయే ఉత్తర్ ప్రదేశ్‌కు పునర్‌ వ్యవస్థీకరణలో పెద్ద పేట వేశారు. యూపీలో
బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్ నుంచి మహిళా ఎంపీ అనుప్రియా పటేల్‌కు చోటుదక్కింది. దీంతో మరో మిత్రపక్షం తమకు క్యాబినెట్‌లో చోటు దక్కలేదని తీవ్ర అగ్రహం వ్యక్తం చేసింది. తన కుమారుడికి మంత్రి పదవి ఇవ్వకపోవడంపై నిషాద్ పార్టీ చీఫ్ సంజయ్ నిషద్ మండిపడ్డారు.తన కుమారుడు, ఎంపీ ప్రవీణ్‌ను క్యాబినెట్‌లోకి తీసుకోకపోవడం తీవ్ర నిరుత్సాహానికి గురిచేసిందని సంజయ్ నిషద్ అన్నారు. అప్పాదళ్ నుంచి అనుప్రియా పటేల్‌ను క్యాబినెట్‌లో తీసుకున్నారు.. అలాంటప్పుడు ప్రవీణ్‌ను ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.అనుప్రియా పటేల్‌కు క్యాబినెట్‌లోకి తీసుకున్నప్పుడు.. ప్రవీణ్ నిషద్‌కు పదవి ఎందుకు ఇవ్వలేదు.. నిషద్ సామాజిక వర్గం ఇప్పటికే బీజేపీ నుంచి దూరమవుతోంది.. ఒకవేళ ఈ తప్పిదాన్ని బీజేపీ సరిదిద్దుకోకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొనక తప్పదు’’ అని సంజయ్ నిషద్ హెచ్చరించారు.అప్నాదళ్ కొన్ని సీట్లకు పరిమితం.. తమ సామాజిక వర్గం 160 అసెంబ్లీ స్థానాల్లో ప్రభావితం చేస్తుంది’ అని అన్నారు. తన అభిప్రాయాలను బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు తెలియజేశానని ఆయన అన్నారు. ‘నిర్ణయాన్ని పునరాలోచించాలి.. ప్రవీవీణ్ నిషాద్‌కు న్యాయం చేస్తారనే పూర్తి నమ్మకం పూర్తి వారిపై ఉంది’ అని ఆయన అన్నారు.ఇక, యూపీ అసెంబ్లీలో నిర్బల్ ఇండియన్ శిశోత్ హమారా ఆమ్ దళ్ (నిషద్) పార్టీకి ఓ ఎమ్మెల్యే ఉన్నారు. సంజయ్ నిషద్ కుమారుడు ప్రవీణ్ సంత్ కబీర్ నగర్ నుంచి 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. అంతకు ముందు యోగి ఆదిత్యానాథ్ రాజీనామాతో గోరఖ్‌పూర్ పార్లమెంట్ స్థానానికి ఉప-ఎన్నిక జరగ్గా.. ఎస్పీ-బీఎస్పీతో మద్దతుతో ప్రవీణ్ విజయం సాధించారు. తదనంతర పరిణామాలతో బీజేపీ కూటమిలో చేరారు.అయితే, కొద్ది రోజుల కిందట సంజయ్ మాట్లాడుతూ… బీజేపీతోనే కొనసాగుతామని అన్నారు. అయితే, తమ సామాజిక వర్గం మాత్రం బీజేపీకి దూరమవుతోందని, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలు మమ్మల్ని మోసం చేశాయని అన్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

- Advertisement -

Tags:If we are not given the post … we will show Tadakha, Nishad is angry

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page