రేవంత్ రెడ్డి నీతులు చెబుతున్నాడు, మంత్రి కేటీఆర్  

0 15

 

తెలంగాణ ముచ్చట్లు:

- Advertisement -

సింగరేణి కార్మికుల కోసం తీర్మానం చేసిన బీజేపీ బుట్టదాఖలు చేసింది.  తెలంగాణ పథకాలు కాపీ కొట్టి కేంద్రం పథకాలు తేస్తోంది.  హుజురాబాద్ కు బీజేపీ వెయ్యి కోట్ల ప్యాకేజి ఇస్తా అంటే మేము వద్దు అంటున్నమా అని మంత్రి కేటీఆర్ అన్నారు.కేసీఆర్ నాలుగు రోజులు బయట తిరుగుతే అందరి నోర్లు మూతపడ్డాయి.  సోనియాగాంధీ తెలంగాణ తల్లి అన్న రేవంత్ రెడ్డి ఆనాడు తెలంగాణ బలిదేవత సోనియాగాంధీ అన్నడు.  కొన్ని రోజులు ఆగితే చంద్రబాబు తెలంగాణ తండ్రి అన్నా అంటడు.  నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి నీతి మాటలు చెప్తుండు.  రేవంత్ రెడ్డి పార్టీ మారడం గురించి మాట్లాడితే ప్రజలు కొడుతారు.  కేసీఆర్ పేరు ఉచ్చరించే అర్హత రేవంత్ రెడ్డి కి లేదు.  రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి పదవి దొరికినట్లు బిల్డప్ కొడుతుర్రు.  టీడీపీ లో గెలిచిన రేవంత్ రెడ్డి రాజీనామా చేశారా?  రాజస్థాన్ లో బీఎస్పీ ఎమ్మెల్యే పార్టీ మారినట్లే ఇక్కడ కాంగ్రెస్ నేతలు టీఆరెస్ నేతలు మారారు.  బజారు నాయకులు చిల్లర మల్లర మాట్లాడితే ఊరుకునేది లేదు.  ఉన్నతమైన పదవులు వస్తే ఉన్నతంగా పనిచేసుకుంటే మంచిదని కేటీఆర్ అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆరెస్ కు తిరుగులేని విజయాన్ని ప్రజలు అందించారు. మున్సిపాలిటీ ల్లో టీఆరెస్ ఘన విజయం సాధించింది. లపొందు లెక్క కొంతమంది ఎగిసిపడొచ్చు. తెలంగాణ ప్రజల కలల తెలంగాణ కావాలంటే కేసీఆర్ కె సాధ్యం. తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్రల సీజన్ వచ్చింది. బండి సంజయ్ పాదయాత్రలో ప్రతి ఊరులో బీజేపీ పాలిత రాష్ట్రానికి తెలంగాణకు తేడా చూడాలి- చెప్పాలి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పథకాలు ఎందుకు లేవో బండి సంజయ్ చెప్పాలి. అక్బర్- బాబర్ కథలు మానుకోవాలి- తెలంగాణకు బీజేపీ ఎమ్ ఇచ్చిందో చెప్పాలి. ఒక్క జాతీయ ప్రాజెక్టు అయినా కేంద్రం తెలంగాణకు ఇచ్చిందాఅని ప్రశ్నించారు.
ఈ మధ్యలో మార్కెట్ లోకి కొత్త బిచ్చగాళ్ల పుట్టారని అయన అన్నారు. న్న మొన్నా పుట్టినోళ్లు- పదవులు వచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కేసీఆర్ ను గెలవాలంటే కేసీఆర్ కంటే ఎక్కువ తెలంగాణను ప్రేమించాలి. కేసీఆర్ ను తిడితే గొప్పోళ్ళు అవ్వరు. ఇతర రాష్ట్రాల్లో రాష్ట్రానికి సీఎం అవుతారు- కానీ ప్రతిపక్షాలు తలబడుతుంది రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు కేసీఆర్. కేసీఆర్ ను కొట్టాలంటే- తలపడాలంటే డైలాగ్స్ కొడితే చాలదు. జిహెసెంసి తరువాత బీజేపీ పరిస్థితి ఏమైందో చూడాలి!. నాగార్జున సాగర్ లో జానారెడ్డిని ఒక కుర్రోడు ఓడించాడని అయన అన్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Rewanth Reddy says morals, Minister KTR

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page