రైతు బాంధవుడు వైఎస్సార్- సర్పంచ్ కొండూరు శ్రీనాథరెడ్డి

0 77

రామసముద్రం ముచ్చట్లు:

 

- Advertisement -

స్వర్గీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి రైతు బాంధవుడని మాలేనత్తం సర్పంచ్ కొండూరు శ్రీనాథరెడ్డి అన్నారు. గురువారం స్థానిక రైతు భరోసా కేంద్రంలో వైయస్సార్ 72 వ జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి ఏర్పాటుచేసి పూలమాలలు వేసి పూజలు నిర్వహించి ఘన నివాళి అర్పించారు. వైయస్సార్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్రెడ్డి భౌతికంగా మనతో లేకపోయినా రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్రంలో ఆయన చేసిన అభివృద్ధిని ఎన్నటికీ మరువలేమన్నారు. నిరుపేదల సొంతింటి కల సాకారం చేయడానికి వేలాదిమందికి ఇళ్ళు ఇవ్వడంతో పాటు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో వైఎస్ఆర్ చేసిన కృషి ప్రజల దేవుడిగా అందరి గుండెల్లో కొలువై ఉన్నారు అన్నారు. ఆయన తనయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ అభివృద్ధి ఫలాలను ప్రతి గడపకు అందిస్తూ పేదల అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భారతి, మహిళా పోలీసు లక్ష్మీ, డిజిటల్ అసిస్టెంట్ బిందు, వెల్పేర్ అసిస్టెంట్ క్రిష్ణప్ప, ఏఎన్ఏం శ్రీవాణి, సర్వేయర్ నరేష్ తదితర సిబ్బంది, వాలింటర్లు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Farmer relative YSSAR- Sarpanch Kondur Srinathreddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page