శ్రీవారి ఆలయంలో జూలై 13న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

0 7

తిరుమల ముచ్చట్లు:

 

 

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 16వ తేదీన సాల‌క‌ట్ల ఆణివార ఆస్థానాన్ని పుర‌స్క‌రించుకుని జూలై 13న‌ మంగళవారంనాడు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు.సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.ఈ సంద‌ర్భంగా ఉదయం 6 నుండి 11 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, గడ్డ కర్పూరం, సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఈ కార్య‌క్ర‌మం అనంత‌రం భ‌క్తుల‌ను సర్వదర్శనానికి అనుమతిస్తారు.

 

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Koil Alwar Thirumanjanam on July 13 at Srivari Temple

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page