సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలి

0 7

– ఆర్ఎల్సి ఆఫీస్ ముందు జాతీయ కార్మిక సంఘాల ధర్నా

పెద్దపల్లి  ముచ్చట్లు:

- Advertisement -

సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఐదు జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్ ఆర్ఎల్సి ఆఫీస్ ముందు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు 2017 అక్టోబర్ 5న నిర్వహించడం జరిగిందని, ఈ సందర్భంగా ఆర్ఎల్సి రెండు సంవత్సరాల కాలపరిమితితో టీబీజీకేఎస్ సంఘానికి గుర్తింపు ఇవ్వడం జరిగిందనీ, కాల పరిమితి దాటి రెండు సంవత్సరాలు గడిచినా సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు. ఇలాంటి చర్యల వల్ల కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా నిర్వహించకపోవడం దుర్మార్గమైన చర్యగా ఉందన్నారు. ఇప్పటికే సింగరేణిలో రాజకీయం జోక్యం పెరిగిపోయి సింగరేణి దివాలా తీసే పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఒకవేళ ఎన్నికలు నిర్వహించకపోతే కార్మికుల సమస్యలు పరిష్కరించడం కోసం అన్ని కార్మిక సంఘాలకు యజమాన్యంతో చర్చించేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐదు జాతీయ కార్మిక సంఘాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది, రాష్ట్ర నాయకులు, ఏఐటీయూసీ వి.సీతారామయ్య, సీ ఐ టీ యూ మంద నరసింహ రావు, ఐఎన్టీయూసీ జనక్ప్రసాద్, హెచ్ఎంఎస్ రియాజ్ అహ్మద్, సీఐటీయూ నుండి మెండె శ్రీనివాస్, కే.రాజయ్య, విజేయగిరి శ్రీనివాస్, ఎస్.వెంకటస్వామి, విజయ్ కుమార్ రెడ్డి, అసరి మహేష్, వేణుగోపాల్ రెడ్డి, ఆరెపెళ్లి రాజమౌళి, నంది నారాయణ,అన్నం శ్రీనివాస్, ఎప్పలపెల్లి సతీష్, హైమద్ పాషా తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Recognized labor union elections should be held in Singareni

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page