హూజూరాబాద్ లో కేటీఆర్ టీమ్

0 19

కరీంనగర్ ముచ్చట్లు:

 


హుజూరాబాద్ ఉప ఎన్నిక మంత్రి కేటీఆర్ కు సవాల్ గా మారనుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండటం, తాను ప్రాతినిధ్యం వహించే ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావడంతో హుజూరాబాద్ ఉప ఎన్నికను కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే ఆయన హైదరాబాద్ లోనే ఉండి అక్కడి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. కొందరి నేతలకు స్వయంగా ఫోన్లు చేసి కేటీఆర్ భరోసా ఇస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన నేరుగా హుజూరాబాద్ ఎన్నికల్లో దిగబోతున్నారట. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావడంతో ఈ ఎన్నిక మరింత ప్రతిష్టాత్మంకగా మారింది.ఈటల రాజేందర్ ను మంత్రి పదవి నుంచి తప్పించిన నాటి నుంచి కేటీఆర్ ఆ అంశంపై ఏ వేదిక మీద మాట్లాడటం లేదు. ఈటల రాజేందర్ ముఖ్యమంత్రితో పాటు మంత్రులను కూడా విమర్శిస్తున్నా కేటీఆర్ మాత్రం ఈటల ఊసే ఎత్తడం లేదు. ఈటలను స్వయంగా అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో ప్రగతి భవన్ కు తీసుకెళ్లిన కేటీఆర్, ఆయన ఎపిసోడ్ తర్వాత ఈటల ఫోన్ కు కూడా చిక్కలేదట. ఈ విషయం ఈటలే స్వయంగా చెప్పారు.ఇక హుజూరాబాద్ లో తన టీంను ఇప్పటికే కేటీఆర్ రంగంలోకి దించారు.

 

 

 

- Advertisement -

ఎప్పటికప్పుడు అక్కడ అప్ డేట్స్ ను తెలుసుకుంటున్నారు. హుజూరాబాద్ ఎన్నికల ప్రభావం వచ్చే సాధారణ ఎన్నికలపై పడుతుందన్న భావనతో సాగర్ తరహా వ్యూహాన్ని అమలు చేయాలని కేటీఆర్ భావిస్తున్నారు. కేసీఆర్ సూచనల మేరకు ఇప్పటికే మండలాల వారీగా మంత్రులకు బాధ్యతలను అప్పగించినా మరికొందరు ముఖ్యమైన, నమ్మకమైన నేతలను హుజూరాబాద్ ఎన్నికలకు పంపాలని కేటీఆర్ భావిస్తున్నారని తెలిసింది.హజూరాబాద్ లో త్వరలో జరిగే అధికారిక కార్యక్రమాల్లో కూడా కేటీఆర్ పాల్గొననున్నారని తెలిసింది. స్వయంగా తాను వెళ్లి కొందరు ముఖ్యమైన నేతలతో మాట్లాడతారని చెబుతున్నారు. ఇప్పటికే హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి కేసీఆర్ బాధ్యతలను హరీశ్ రావుకు అప్పగించారు. అయితే ఏమాత్రం తేడా రాకూడదని భావించిన కేటీఆర్ ఈటలకు ముఖ్య అనుచరులను కూడా పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తంమీద కేటీఆర్ హుజూరాబాద్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇప్పటికే రంగంలోకి దిగారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: KTR team in Huzurabad

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page