అక్రమ మైనింగ్ పై సీబీఐతో దర్యాప్తు జరపాలి: ఆలపాటి రాజా డిమాండ్

0 18

అమరావతి ముచ్చట్లు:

 

విశాఖ మన్యంలో ఎవరి కనుసన్నల్లో అక్రమ మైనింగ్ జరుగుతోందని టీడీపీ ఆలపాటి రాజా ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో సీఎం పాత్రధారో, సూత్రధారో తేలాంటే సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. మైనింగ్‌ లీజులు పొందింది ఎవరని, ఖనిజాన్ని దోచేస్తుంది ఎవరని ఆయన నిలదీశారు. లవకుమార్ రెడ్డి, విక్రాంత్ రెడ్డి ఎవరని, ఎవరి లారీల్లో ఖనిజాన్ని కడపకు తరలిస్తున్నారని ప్రశ్నలు సంధించారు. వాస్తవాలు బయటకువస్తాయనే టీడీపీ నేతలను అడ్డుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం అఖిలపక్షాన్ని మైనింగ్ ప్రాంతానికి తీసుకెళ్లాలని ఆలపాటి రాజా డిమాండ్ చేశారు.

 

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Alleppey Raja demands probe into illegal mining with CBI

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page