ఆదాయాలు కోల్పొయిన 20 కోట్ల మంది

0 12

ముంబై ముచ్చట్లు:

 

 

ముప్పై ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే టైమ్‌‌‌‌‌‌‌‌లో దేశంలో ఆర్థిక సంస్కరణలు స్టార్టయ్యాయి.  సుమారు 30 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. అప్పుడు వేసిన పునాదులతో  వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఇండియా ఎదగగలిగింది. ఈ 30 ఏళ్లలో సాధించిన ఎకానమీ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ను కేవలం కొన్ని నెలల్లోనే కోల్పోయాం. కరోనా వైరస్ దెబ్బకు  దేశ ఆర్థిక పరిస్థితులు చిందరవందరగా మారిపోయాయి. ఇంకో నాలుగేళ్లలో ఐదు ట్రిలియన్‌‌‌‌‌‌‌‌ డాలర్ల ఎకానమీగా ఎదుగుతామని పెట్టుకున్న టార్గెట్‌‌‌‌‌‌‌‌కు గండి పడింది.  దేశంలో ఆర్థిక సంస్కరణలు ఊపందుకున్న టైమ్‌‌‌‌‌‌‌‌లో హెల్త్‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రభుత్వాలు పట్టించుకోలేదనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఏడాదిన్నర కాలంగా కరోనా సంక్షోభంతో పోరాడుతున్న ఇండియా ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారాయని ఎనలిస్టుల సర్వేలు చెబుతున్నాయి. కరోనా సంక్షోభ టైమ్‌‌‌‌‌‌‌‌లో సుమారు 20 కోట్ల మంది ప్రజల ఆదాయాలు తగ్గిపోయాయని అజిమ్‌‌‌‌‌‌‌‌ ప్రేమ్‌‌‌‌‌‌‌‌జీ యూనివర్శిటీ లెక్కించింది. వీరి కనీస జీతం రోజుకి రూ. 70 ల కంటే కిందకి పడిపోయిందని పేర్కొంది. ప్యూ రీసెర్చ్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌ అంచనా ప్రకారం, సుమారు 3.2 కోట్ల మంది మిడిల్‌‌‌‌‌‌‌‌క్లాస్‌‌‌‌‌‌‌‌ ప్రజలు పేదరికంలోకి జారుకున్నారని తెలిపింది.

 

 

 

- Advertisement -

మన దేశ ఎకానమీకి  మిడిల్‌‌‌‌‌‌‌‌ క్లాస్‌‌‌‌‌‌‌‌ వెన్నెముక. గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న  టైమ్‌‌‌‌‌‌‌‌లో కరోనా దెబ్బతో  దేశంలో వినియోగ సామర్ధ్యం పడిపోయింది.రానున్న పదేళ్లు ఇండియావే  అనే  అంచనాలు ఉండేవి. ఇతర దేశాల్లోలా అభివృద్ధికి సహకరించిన వర్కింగ్ ఏజ్ గ్రూప్‌‌‌‌‌‌‌‌ ప్రస్తుతం ఇండియాలో ఎక్కువగా ఉన్నారు. అయినప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది.  దేశ తలసరి ఆదాయం 2020-–21 లో రూ. 86,659 కి తగ్గుతుందని ఐఎంఎఫ్‌‌‌‌‌‌‌‌ అంచనావేస్తోంది. 2019–20 లో  ఇది రూ. 94,566 గా లెక్కించింది. ఇంకో పదేళ్లు వెనక్కి వెళ్లామని  మోడీ ప్రభుత్వంలో చీఫ్‌‌‌‌‌‌‌‌ ఎకనామిక్ అడ్వైజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేసిన అరవింద్‌‌‌‌‌‌‌‌ సుబ్రమణియన్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు. ఫండమెంటల్‌‌‌‌‌‌‌‌గా మార్పులు చేస్తూ, కొన్ని పెద్ద సంస్కరణలను తెస్తేనే తిరిగి 7–8 శాతం గ్రోత్‌‌‌‌‌‌‌‌కు చేరువవుతామని అభిప్రాయపడ్డారు. కరోనాకు ముందు నుంచే ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నోట్ల రద్దు, జీఎస్‌‌‌‌‌‌‌‌టీ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌‌‌‌‌ వలన ఏర్పడిన లాస్‌‌‌‌‌‌‌‌ను ఇంకా చేరుకోలేకపోయాం. వీటి నుంచి రికవరీ అవుతున్న టైమ్‌‌‌‌‌‌‌‌లో కరోనా  దెబ్బకొట్టింది. మోడీ ప్రభుత్వానికి ముందు కూడా స్కామ్‌‌‌‌‌‌‌‌లు,

 

 

 

 

ఎకానమీకి ఊపు తెచ్చే పాలసీలేవి లేకపోవడంతో  అప్పుడు కూడా దేశ ఆర్థిక వ్యవస్థ కష్టాల్లోనే ఉంది.మోడీ ప్రభుత్వం వచ్చాక 2025 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థను ఐదు ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని టార్గెట్‌‌‌‌‌‌‌‌ పెట్టుకున్నారు. కానీ,  ఈ టార్గెట్‌‌‌‌‌‌‌‌ను చేరుకోవడానికి  కనీసం 8 శాతం జీడీపీ గ్రోత్‌‌‌‌‌‌‌‌ను సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ గ్రోత్‌‌‌‌‌‌‌‌ రేటు 6.9 శాతానికి మించదని ఐఎంఎఫ్ అంచనావేస్తోంది. కిందటి ఆర్థిక సంవత్సరంలో నెగెటివ్ గ్రోత్‌‌‌‌‌‌‌‌ను నమోదు చేయడంతో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లో బేస్ వలన డబుల్ డిజిట్‌‌‌‌‌‌‌‌ గ్రోత్‌‌‌‌‌‌‌‌ను సాధిస్తామని అంచనావేశాం. కానీ, కరోనా సెకెండ్ వేవ్‌‌‌‌‌‌‌‌ దెబ్బకి  ఈ అంచనాలన్ని మారిపోయాయి. ప్రభుత్వం కూడా లాంగ్‌‌‌‌‌‌‌‌టెర్మ్‌‌‌‌‌‌‌‌ గ్రోత్‌‌‌‌‌‌‌‌ కోసం సంస్కరణలు అవసరమని ఒప్పుకుంది. ‘నిలకడగా 8–10 శాతం గ్రోత్‌‌‌‌‌‌‌‌ను నమోదు చేయాలంటే కేవలం ప్రస్తుత పరిస్థితుల నుంచి బయటపడడానికే కాదు, లాంగ్‌‌‌‌‌‌‌‌టెర్మ్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’ అని ప్రభుత్వ ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌ ఎకనామిక్ అడ్వైజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంజీవ్‌‌‌‌‌‌‌‌ సాన్యల్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు. పెరుగుతున్న  వాణిజ్య లోటు, ఫారిన్ రిజర్వ్‌‌‌‌‌‌‌‌లు విపరీతంగా తగ్గిన పరిస్థితుల్లో  1991 లో అప్పటి  ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్‌‌‌‌‌‌‌‌ ఐఎంఎఫ్‌‌‌‌‌‌‌‌ దగ్గర అప్పు చేసి వ్యవస్థను గాడిలో పెట్టడానికి ప్రయత్నించారు.

 

 

 

 

టారిఫ్‌‌‌‌‌‌‌‌లను తగ్గించి దేశంలో ట్రేడ్‌‌‌‌‌‌‌‌ను పెంచాలని చూశారు. దేశ ఆర్థిక వ్యవస్థను గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా ఆయన ఓపెన్ చేశారని చెప్పొచ్చు.  ఆ తర్వాతే ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు ప్రారంభమయ్యాయి. దేశంలో ఐటీ ఇండస్ట్రీ డెవలప్‌‌‌‌‌‌‌‌ అయ్యింది. జనరిక్ మెడిసిన్స్‌‌‌‌‌‌‌‌ తయారీకి గ్లోబల్‌‌‌‌‌‌‌‌ హబ్‌‌‌‌‌‌‌‌గా ఇండియా ఎదిగింది. ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ కంపెనీ సీరమ్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ పుట్టుకొచ్చింది. ఆర్థిక సంస్కరణల పునాదులు బలంగా ఉండడంతోనే దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఉన్న స్టేజ్‌‌‌‌‌‌‌‌కి చేరుకుంది.   ప్రస్తుతం నెట్‌‌‌‌‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌‌‌‌‌, అమెజాన్‌‌‌‌‌‌‌‌, ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్ వంటి గ్లోబల్‌‌‌‌‌‌‌‌ కంపెనీలు ఇండియన్ మార్కెట్‌‌‌‌‌‌‌‌పై ఎక్కువ ఆశలు పెట్టుకున్నాయి.  ఇండియాలో రిటైల్‌‌‌‌‌‌‌‌ బిజినెస్‌‌‌‌‌‌‌‌ను మరింత విస్తరించేందుకు అంబానీతో గొడవ పడి కోర్టుల చుట్టు కూడా తిరుగుతోంది. అయినప్పటికీ  సామర్ధ్యానికి తగ్గట్టు ఇండియా ఇంకా ఎదగలేదని ఎనలిస్టులు అంటున్నారు. గత 30 ఏళ్లలో దేశ సగటు జీడీపీ కేవలం 6.2 శాతంగానే ఉంది. అదే చైనా 9.2 శాతం సగటు గ్రోత్‌‌‌‌‌‌‌‌తో ఎదిగింది. మన జీడీపీ గ్రోత్ రేటు వియత్నం గ్రోత్‌‌‌‌‌‌‌‌ రేటు 6.7 శాతం కంటే తక్కువ. కరోనా సంక్షోభంతో దేశ ఆర్థిక వ్యవస్థ కొన్నేళ్ల వెనక్కి వెళ్లిందని, గ్రోత్‌‌‌‌‌‌‌‌ డౌన్‌‌‌‌‌‌‌‌సైడ్‌‌‌‌‌‌‌‌లో ఉందని రిజర్వ్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్ బోర్డు మాజీ సభ్యురాలు ఇందిరా రాజారమన్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు. ఈ సంక్షోభం నుంచి ఎంత తెలివిగా  బయటపడతామనేది దేశ ఎకానమీ గ్రోత్‌‌‌‌‌‌‌‌ను నిర్ణయిస్తుందని చెప్పారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: 20 crore people lost revenue

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page