ఎస్పీకి ఆత్మీయ వీడ్కోలు

0 22

మచిలీపట్నం ముచ్చట్లు:

 

రెండు సంవత్సరాల పాటు వినూత్న కార్యక్రమాలతో, సిబ్బంది సంక్షేమం లో కృష్ణాజిల్లాలో తనదైన ముద్ర వేసుకొని బదిలీపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా బదిలీ అవుతున్న జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబుకు  ఆర్మూర్డ్  రిజర్వ్ ఆధ్వర్యంలో పెరెడ్ నిర్వహించి ఘనంగా నిర్వహించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. ముందుగా పెరేడ్ కమాండర్ తో గౌరవవందనం స్వీకరించి, పెరేడ్ పరిశీలన అనంతరం ప్లటున్ల వారీగా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించి, వారి నుండి ఆత్మీయ వీడ్కోలు తీసుకున్నారు.ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ ఈ రెండు సంవత్సరాల కాలంలో చేపట్టిన ప్రతి కార్యక్రమానికి సిబ్బంది అందించిన సహకారం అభినందనీయం, బదిలీల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కి బదిలీ అవుతున్నప్పటికీ మీ యొక్క సేవలను ఎన్నడు నా మదిలో నెమరు వేసుకుంటూ ఉంటానని, మనం అందరం కలిసికట్టుగా ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య కరోనా వైరస్. ఆ సమయంలో లా అండ్ ఆర్డర్ సిబ్బంది  కన్న,ఆర్మూర్ రిజర్వ్ పోలీస్ అధికారులు సిబ్బంది అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని, అనునిత్యం రహదారులపై ఉండి శాంతిభద్రతలను పరిరక్షించడంలో ప్రధాన భూమిక పోషించారని కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఆర్ఎసై,  ఆర్ ఎస్ ఐ లు, ఆర్ఐలు, డీఎస్పీలు,  అడిషనల్ ఎస్పీ ఇలా ఒకరిని కాదు, అందరూ ఏ పని గురించి చెప్పిన ఎంతో నిబద్ధత గా విధులు నిర్వర్తించారని, అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఎంతో మంది సిబ్బంది వైరస్ బారినపడి కోలుకున్న, కొంతమందిని కోల్పోయామని, వారందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు.

 

 

 

- Advertisement -

కరొన సమయంలో బెడ్లు దొరక్క ఏ ఒక్క సిబ్బంది ఇబ్బంది పడకూడదని సిబ్బంది సంక్షేమాన్ని కాంక్షించి ప్రత్యేకంగా కోవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేసి 80 మందికి పైగా సిబ్బందికి వైద్య చికిత్స అందజేశామని, అలాగే హోంగార్డ్స్ సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలు హోంగార్డ్స్ కూడా వచ్చేలా చర్యలు తీసుకున్నామని, రెండు సంవత్సరాల పాటు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావరణంలో విధులు నిర్వర్తించామంటే అది అందరి యొక్క కృషి తోనే సాధ్యం అయిందని మీ అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.

 

 

 

తరువాత  ఎస్పీ  జిల్లా ఆర్మూర్ రిజర్వ్ తరపున ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ, ఇతర అధికారులు శాలువాతో సన్మానించి, జ్ఞాపిక అందజేసి అయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి ధర్మేంద్ర,  పట్టణ డీఎస్పీలు మాసుం భాష, రాజీవ్ కుమార్,  భరత్ మాతాజి, మోజెస్ పాల్,  రమేష్, , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రమణ,  సి ఐ-2 శ్రీనివాసరావు,  డిసిఆర్బి ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్,  పట్టణ సి ఐలు అంకబాబు, భీమరాజు,  రమేష్ ,  కొండయ్య,  సన్యాసి నాయుడు,  రామకృష్ణ, ఆర్ఐలు  శ్రీనివాస రావు, చంద్రశేఖ,  విజయసారథి,  ఎస్సైలు ఆర్ ఎస్ ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:Spiritual farewell to SP

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page