గోరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలి…విశ్వహిందూ పరిషత్-భజరంగ్ దళ్

0 32

కర్నూలు ముచ్చట్లు:

 

హిందూ మనోభావాలను గౌరవించి గోరక్ష చట్టాలను కఠినంగా అమలు పరిచి,గోవులను కాపాడాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి కోరారు.శనివారం రోజున కర్నూలులో స్థానిక వినాయక ఘాట్ లోని వినాయక స్వామి దేవాలయ సమావేశం మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నందిరెడ్డి సాయిరెడ్డి మాట్లాడుతూ దశాబ్దాలపాటు గోరక్ష చట్టాల విషయంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్  నిర్విరామంగా పోరాడుతుందని, అయినా సంఘ విద్రోహ శక్తులు పని కట్టుకొని గోవులను అక్రమంగా రవాణా చేస్తూ,గోవధ చేస్తూ హిందూ మనోభావాలను, సంప్రదాయాలను అవమానపరుస్తూ మత ఘర్షణలకు పాల్పడుతున్నారని సూచించారు.రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గోరక్ష చట్టాల అమలులోకి వచ్చే ప్రభుత్వ అధికారులకు కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.కర్నూల్ విశ్వహిందూ పరిషత్ అధ్యక్ష, కార్యద్యక్షులు డాక్టర్ లక్కిరెడ్డి అమర సింహారెడ్డి,గోరంట్ల రమణ లు మాట్లాడుతూ హిందువుల మనోభావాలను గౌరవించాలని, గోరక్ష చట్టాలను కఠినంగా అమలు చేయాలని ప్రజాస్వామ్య బద్దంగా విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ దశలవారీగా ఉద్యమం చేపడుతుందని తెలిపారు.

 

 

 

- Advertisement -

బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ తూముకుంట ప్రతాపరెడ్డి మాట్లాడుతూ గోరక్షణ చట్టాలను అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 12 వ తేది ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుందని,జూలై 16 వ తేదీన భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్షలు చేపడుతున్నామని తెలిపారు.ఈ నిరసన కార్యక్రమాలలో హిందూ ధార్మిక,ఆధ్యాత్మిక, సామాజిక,సేవ,కుల సంఘాల సమన్వయంతో నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ మీడియా సమావేశంలో విశ్వహిందూ పరిషత్ కర్నూల్ నగర కార్యదర్శి భాను ప్రకాష్,బజరంగ్ దళ్ నాయకులు నీలి నరసింహ,రామకృష్ణ,పల్లేటి సాంబశివ రెడ్డి,చల్లా ప్రసన్నకుమార్ రెడ్డి,నవీన్ తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

Tags: Gorakshana laws should be strictly enforced … Vishwa Hindu Parishad-Bhajarang Dal

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page