పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

0 192

పుంగనూరు ముచ్చట్లు:

 

జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కరించి, రూ.11.32 లక్షలు నగదును బాధితులకు అందజేసినట్లు పుంగనూరు సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌ తెలిపారు. శనివారం ప్రిన్సిపుల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి రాహుల్‌ అంబేద్కర్‌, న్యాయవాదులు, పోలీస్‌ అధికారులతో కలసి లోక్‌అదాలత్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా సివిల్‌ కేసులు -19 , క్రిమినల్‌ కేసులు -123 పరిష్కరించినట్లు జడ్జిబాబునాయక్‌ తెలిపారు. లోక్‌అదాలత్‌ ద్వారా కేసులు పరిష్కరించుకుని, ప్రజలుశాంతియుతవాతావరణంలో జీవించాలని కోరారు. లోక్‌ అదాలత్‌లో పరిష్కారమైయ్యే కేసులపై అప్పీల్‌ ఉండదని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘ నేతలు వీరమోహన్‌రెడ్డి, ఆనంద్‌కుమార్‌, సీఐలు గంగిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి తో పాటుపలువురు అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: 146 cases settled in Punganur National Lok Adalat – Senior Civil Judge Babu naicl

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page