ప్ర‌తి ఒక్క‌రూ బాధ్య‌త‌గా చెట్లు నాటి వాటిని సంర‌క్షించాలి: మంత్రి స‌త్య‌వ‌తి

0 27

ములుగు ముచ్చట్లు:

 

పల్లె ప్రగతి, హరిత హారం కార్య‌క్ర‌మంలో భాగంగా నేడు ములుగు జిల్లా, జాకారం అటవీ క్షేత్రంలో రాష్ర్ట మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ మొక్క‌లు నాటారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా జ‌డ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, ఎంపీపీ శ్రీదేవి, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి, అటవీ శాఖ అధికారి ప్రదీప్ షెట్టి, టీఆర్ఎస్ నేతలు గోవింద్ నాయక్‌తో పాటు ప‌లువురు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి స‌త్య‌వ‌తి మాట్లాడుతూ.. ప‌ల్లె ప్ర‌గ‌తితో గ్రామాల్లో అద్భుత‌మైన అభివృద్ధి జ‌రుగుతుంద‌న్నారు. సీజ‌న‌ల్ వ్యాధులు దూర‌మ‌య్యాయ‌ని తెలిపారు. ప్ర‌తి ఒక్క‌రూ బాధ్య‌త‌గా చెట్లు నాటి వాటిని సంర‌క్షించాల‌న్నారు. ప‌చ్చ‌ద‌నం పెంచేందుకు ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌న్నారు. మొక్క‌ల సంర‌క్ష‌ణ‌కు అధికారులు, గ్రామ‌స్తులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రి స‌త్య‌వ‌తి ఆదేశించారు.

 

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Everyone must responsibly protect the trees: Minister Satyavati

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page