మార్గదర్శులుగా మారుతున్న మహిళ

0 17

తిరుపతి ముచ్చట్లు:

 

ఒకప్పుడు ఇంటికే పరిమితం అయిన మహిళలు ఇప్పుడు ఎంతోమందికి మార్గదర్శులుగా మారారు.తమ ప్రతిభతో తమ ఇంటినే కాదు ఊరుని కూడా చక్కదిద్దుతున్నారు. చినుకు జాడలేని నేలపై కొత్త ఆశలు చిగురించేలా చేస్తున్నారు. అటువంటి ఓ అద్భుతమైన గొప్ప అభివృద్ధికి మార్గదర్శిగా మారారు ఓ సాధారణ మహిళ.ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిరన పారేశమ్మ అనే ఓ సాధారణ మహిళ సాగు బరువైన చోట శిరులు పండేలా చేసింది. బీడువారిన భూములలో పచ్చదనం మొలకెత్తేలా చేసింది. కరవు పల్లెలను సస్యశ్యామలం చేసింది. రైతుల్లో చైతన్యం నింపింది. 16 గ్రామాల పల్లెల్లో చైతన్యం నింపింది పారేశమ్మ అనే ఓ సాధారణ మహిళ. అసాధారణ అభివృద్ధికి బాటలు వేసింది. ఐక్యరాజ్య సమితితో శభాష్ అనిపించుకుంది పారేశమ్మ. చుక్క నీరులేని చోట పంటలేం పండుతాయి అని నిరాశ పడిన రైతన్నల్లో చైతన్యాన్ని నింపి..పంట మార్పిడి, నీటి సంరక్షణ, సాగులో పొదుపు పద్ధతుల గురించి అవగాహన కల్పించిం ఐక్యరాజ్య సమితితో శభాష్ అనిపించుకుంది చిత్తూరు జిల్లాకు చెందిన వాటర్ ఉమెన్‌ పారేశమ్మ.చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాల్లోని చాలా గ్రామాలు కరువుకు కేరాఫ్‌ అడ్రస్ గా ఉండేవి. 1000 నుంచి 12వందల అడుగులు తవ్వితే కానీ చుక్కనీరు కనిపించేది కాదు. నీళ్లు లేకపోవడంతో రైతులు వ్యవసాయాన్ని వదిలేసి.. ఉపాధి కోసం బెంగళూరు వలస వెళ్లిపోయేవారు. నిరాశ నిండిని జీవితాల్లోకి వెలుగులు తెచ్చింది.

 

 

 

 

- Advertisement -

పారేశమ్మ. ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో జల సంరక్షణలో 16 గ్రామాల పల్లెల్లో చైతన్యాన్ని తీసుకొచ్చింది పారేశమ్మ. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నీటి పొదుపు, ప్రత్యామ్నాయ పంటసాగుపై రైతాంగానికి అవగాహన కల్పించారు. ఐక్యరాజ్యసమితి అవార్డుకు ఎంపికయ్యి శెభాష్ అనిపించుకుంది.చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లె సమీపంలోని గోపిదిన్నె గ్రామానికి చెందిన పారేశమ్మ.. 10th క్లాస్ చదివి ఐటీఐ పూర్తి చేశారు. మొదట్లో చిన్నాచితకా ఉద్యోగాలు చేసింది. ఆ తరువాత ఫౌండేషన్ ఫర్ ఎకొలాజికల్ సెక్యూరిటీ సంస్థలో చేరి..పర్యావరణ పునరుద్ధరణ, వనరుల పరిరక్షణ వంటి అంశాల్లో ఈ సంస్థ కృషి చేస్తోంది. ఆ విధానాలను పల్లెలకు వెళ్లి రైతులకు అవగాహన కల్పించడం పారేశమ్మ పని. ఈ వృత్తి ఆమెకు చాలా ఇష్టాన్ని కలిగించింది. ఆ ప్రాంతంలో నీటి కష్టాలు ఆమెను కదిలించాయి. వ్యవసాయం వదిలేసిన రైతుల్లో తిరిగి వ్యవసాయం చేయించాలనే నిర్ణయించుకున్నారు. ఆ పట్టుదలతోనే 16 గ్రామాల పల్లెల్లో చైతన్యం నింపింది. ప్రపంచవ్యాప్తంగా అభినందనలు అందుకునేలా చేస్తోంది.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: A woman who becomes a guide

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page