రాయలసీమ రాష్ట్రానికై ఐక్యంగా పోరాడుదాం

0 17

-రాయలసీమ కో ఆర్డినేషన్ కమిటీ(ఆర్సీసీ)

ఆదోని ముచ్చట్లు:

 

- Advertisement -

వెనుకబడిన జిల్లాల అభివృద్ధికికై  ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం ఐక్యంగా ఉద్యమించాలని రాయలసీమ కో ఆర్డినేషన్ కమిటి రాష్ట్ర ప్రణాళిక కమిటీ చైర్మన్ రామకృష్ణ రెడ్డి గారు అన్ని రంగాల ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం నాడు ఆదోని పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ నందు రాయలసీమ కో ఆర్డినేషన్ కమిటీ ఆదోని రెవిన్యూ డివిజన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆర్సీసీ రాష్ట్ర ప్రణాళిక చైర్మన్ రామకృష్ణ రెడ్డి గారు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజు,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రామలింగయ్య మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలో కరువు,వలసలను నివారించి ,ఈ ప్రాంతంలో నీటి ప్రాజెక్టుల సాధన కోసం ప్రజలు ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారు. ననాటిగా ఈ ప్రాంతం నుండి మంత్రులు, ముఖ్యమంత్రిలు పరిపాలన అందించిన ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఒక పని కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రధానంగా కర్నూలు పశ్చిమ ప్రాంతం నుండి నదులు పారుతున్న ప్రాజెక్టుల విషయంలో నాయకులు రాజకీయ వివక్షతో ఈ ప్రాంతానికి మరింత అన్యాయం చేయడం సరికాదన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక నిధులు,నీళ్లు,నియామకాలు కేటాయించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు.

 

 

 

 

మన ప్రాంత సమస్యల పరిష్కారం కోసం నూతన రాష్ట్రంగా ఏర్పాటుకై ప్రజలందరూ పార్టీలకు,జెండాలకు అతీతంగా సీమా రాష్ట్రానికై పోరాడాలని పిలుపు ఇచ్చారు. అనంతరం రాయలసీమ కో ఆర్డినేషన్ కమిటీ(RCC)ఆదోని రెవిన్యూ డివిజన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా దస్తగిరి నాయుడు,అధ్యక్షులుగా ఎల్లప్ప,ప్రధాన కార్యదర్శి గా సుధాకర్ తో పాటు మరో 21 మంది కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు ఈ సమావేశంలో RCC రాష్ట్ర మీడియా ఇంఛార్జి నాగరాజు,రాష్ట్ర ఉపాధ్యక్షులు లోకేష్,రాయలసీమ కళా వేదిక నాయకులు రవికుమార్,రత్నమ్మ,రామాంజనేయులు,యువజన వేదిక రాష్ట్ర నాయకులు రామంజి,ప్రతాప్,రైతు కూలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు నరసింహయ్య,ప్రగతిశీల మహిళ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సుజ్ఞానమ్మ, సీమ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ రామరాజు,కో కన్వీనర్ నవీన్,మరియు నాయకులు రవివర్మ,అనిల్,వీరేష్,మురళి, వెంకటేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Let us fight unitedly for the state of Rayalaseema

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page