లైమ్ లైట్ లోకి కాటసాని

0 18

కర్నూలు ముచ్చట్లు:

 

క‌ర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాట‌సాని రాంభూపాల్ రెడ్డి.. రూట్ మార్చారా ? మౌనంగా ఉంటే క‌ష్టమేన‌ని భావిస్తున్నారా ? అటు పార్టీలోను, ఇటు నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఇబ్బందులు త‌ప్పవ‌ని గ్రహించారా ? అంటే తాజా ప‌రిణామం అవున‌నే స్పష్టం చేస్తోంది. ప్ర‌స్తుతం కాట‌సాని దూకుడు పెంచారు. అదేస‌మ‌యంలో త‌న రాజ‌కీయ ట్రాక్‌కూడా మార్చారు. గ‌తానికి భిన్నంగా ఆయ‌న ఫైర్ బ్రాండ్ అయ్యేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. రాజ‌కీయాల‌కు పెట్టనికోట అయిన క‌ర్నూలులో చాలా మంది కీలక నేతలు ఫైర్ బ్రాండ్ల మాదిరిగా రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో ఎంతో సీనియ‌ర్ మోస్ట్ నాయ‌కుడు అయిన‌ కాట‌సాని రాంభూపాల్ రెడ్డి మాత్రం సైలెంట్ గానే ఉన్నారు. కాట‌సాని ఆరు సార్లు ఎమ్మెల్యే అయినా వివాదాల‌కు ఎప్పుడూ కాస్త దూరంగానే ఉంటార‌న్న పేరుంది.కానీ, త‌న‌క‌న్నా జూనియర్లు.. నిన్న మొన్ననే రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన నేత‌లు మాత్రం.. బిజీఅవుతున్నారు.. కీల‌క వ్యాఖ్యల‌తో పాలిటిక్స్‌ను వేడెక్కిస్తున్నా రు. దీంతో జిల్లాలో పాణ్యం నియోజ‌క‌వ‌ర్గం.. గురించి పెద్దగా చ‌ర్చలేకుండా పోయింది. మ‌రోవైపు.. ఇక్కడి మాజీ వైసీపీ నాయ‌కురాలు.. చ‌రితా రెడ్డి తిరిగి వైసీపీలోకి వ‌చ్చేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. ఆమె గ‌తంలో ఇక్కడ వైసీపీ త‌ర‌ఫున గెల‌వ‌డం తోపాటు గ‌ట్టి వాయిస్ వినిపించారు. టీడీపీని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు సంధించారు. దీంతో పాణ్యం నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు లైమ్‌లైట్‌లో ఎప్పుడూ.. హాట్‌హాట్‌గా సాగాయి.అయితే.. ఆమె గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్లారు. అక్కడ నెగ్గలేక పోతున్నారు.

 

 

 

 

- Advertisement -

పైగా వైసీపీలోనే ఉంటే.. త‌న‌కు గుర్తింపు ఉండేద‌ని.. ప‌లుమార్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఎప్పుడు అవ‌కాశం వ‌స్తే.. అప్పుడు వైసీపీ గూటికి వ‌చ్చేందుకు చ‌రితా రెడ్డి రెడీగాఉన్నారు. చ‌రితారెడ్డికి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీల‌తో సంబంధం లేకుండా బ‌లం ఉంది. వాళ్లు రిట‌ర్న్ బ్యాక్ వస్తే ఇక్కడ పార్టీ ఎంతైనా డిస్టర్బ్ అవుతుంది. అందుకే ఆమెకు కాట‌సాని రాంభూపాల్ రెడ్డి చెక్ పెట్టే పనిలో ఉన్నారు.ఈ నేప‌థ్యంలో త‌న దూకుడు పెంచ‌క‌పోతే.. క‌ష్టమే అని భావించిన కాట‌సాని రాంభూపాల్ రెడ్డి ఇటీవ‌ల కాలంలో టీడీపీని టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు సంధిస్తున్నారు. త‌ర‌చుగా మీడియా ముందుకు వ‌స్తున్నారు. ప్రజ‌ల మ‌ధ్య ఉంటున్నారు. నిజానికి ఎంతో సీనియ‌ర్ ఎమ్మెల్యే అయిన కాట‌సాని రాంభూపాల్ రెడ్డి ఇప్పటికీ.. సౌమ్యుడిగానే పేరుతెచ్చుకున్నా.. మారుతున్న రాజ‌కీయాల‌కు అనుగుణంగా మారాల్సివ‌స్తోంద‌ని.. ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags: Katsani into Lime Light

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page