పద్మ అవార్డు  కోసం నామినేషన్లు పేర్లు పంపండి: మోదీ

0 35

దిల్లీ ముచ్చట్లు:

 

పద్మ అవార్డుల కోసం నామినేషన్లు పంపాలని ప్రధాని మోదీ ప్రజలను ట్విటర్‌ వేదికగా విజ్ఞప్తి చేశారు. మారుమూల ప్రాంతాల్లో వివిధ రంగాల్లో విశేష సేవలందిస్తున్న వారిని గుర్తించి పద్మ అవార్డులకు సిఫార్సు చేయాలని కోరారు. ‘‘భారత్‌లో ప్రతిభ గలవారు అనేక మంది ఉన్నారు. వారంతా క్షేత్రస్థాయిలో విశేష సేవలందిస్తున్నారు. కానీ, వారి గురించి మనం పెద్దగా పట్టించుకోం. అలాంటి వారు మీకు తెలుసా? వారిని మీరు పద్మ అవార్డులకు నామినేట్‌ చేయొచ్చు. నామినేషన్లు పంపేందుకు సెప్టెంబరు 15 వరకు అవకాశం ఉంది’’ అని మోదీ ట్విటర్‌లో రాసుకొచ్చారు.గత కొన్నేళ్లుగా మారుమూల ప్రాంతాల్లో వివిధ రంగాల్లో విశేష కృషి చేస్తున్న సామాన్యులను సైతం కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులతో సత్కరిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర హోంశాఖ పద్మ అవార్డులకు నామినేషన్లు పంపాలని వివిధ శాఖలతో పాటు సంస్థలు, ప్రముఖులను కోరింది. ముఖ్యంగా సామాజికంగా వెనుకబడిన తరగుతులు, దివ్యాంగులు, మహిళల్లో సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్న వారిని గుర్తించాలని సూచించింది.

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

Tags: Send nominations for Padma Award: Modi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page