అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

0 18

– గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మ పృద్విరాజ్ వెల్లడి

విశాఖపట్నం ముచ్చట్లు:

 

- Advertisement -

అఖిలభారత అంగన్వాడీ కోర్కెల దినం సందర్భంగా ఐసిడిఎస్ ను బలోపేతం చేయాలని రాష్ట్రంలో నూతన విద్యా విధానాన్ని అమలు చేయడానికి తీసుకొచ్చిన సర్కులర్ నెంబర్ 172 A& 1/20 20 సర్క్యులర్ ను ఉపసంహరించుకోవాలని అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కనీస వేతనం చెల్లిస్తూ రిటైర్మెంట్ బెనిఫిట్ కింద 3లక్షలు ఇస్తూ వేతనంలో సగం పెన్షన్ గా ఇవ్వాలని రిటైర్మెంట్ అయిన కార్మికులకు ఇవ్వాలని కరోణతో చనిపోయిన అంగన్వాడికి 50 లక్షలు ప్రభుత్వ బీమా తో పాటు  కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని హెల్పర్స్ మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని రాజకీయ జోక్యాన్ని సచివాలయ పోలీసుల వేధింపులు అరికట్టాలని పెండింగ్ అద్దె బిల్లులు చెల్లించాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం కల్పించాలని,వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలని
సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయాలని తదితర డిమాండ్లతో దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా పెదబయలు మండలం లో ఐసిడిఎస్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఐసిడిఎస్ అధికారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది.

 

 

 

ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి కిలో సరబన్న మాట్లాడుతూ….
నాడు నేడు పేరుతో ప్రాథమిక పాఠశాలలు మెరుగు పరుస్తున్నటు ఐ సి డి ఎస్, అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి నిధులు కేటాయించి మంచి వాతావరణం తో కూడిన భవనాలను ప్రభుత్వం నిర్మించి ఇవ్వాలని ఐసిడిఎస్ లో ఉన్న సమస్యలను పరిష్కారం చేయడానికి ప్రభుత్వం దృష్టి సారించాలని అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే విషయంలో మొదటి నుంచి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటం సరికాదని అంతేకాకుండా రిటైర్మెంట్ అయిన తర్వాత బెనిఫిట్ తోపాటు పెన్షన్ ఇవ్వకపోవడం వల్ల ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందికి గురి కాబడుతుందని ఈ అంగన్వాడి సమస్యలన్నిటినీ పరిష్కారం చేయాల్సిన బాధ్యత కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందన్నారు.
గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శికే.పృథ్వి రాజు

 

 

 

అంగన్వాడీ కార్మికులు చేస్తున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలియజేసారు. కార్మికుల సమస్యలను పరిష్కారం చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని విడనాడాలని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పి ప్రభుత్వ ఉద్యోగులను రోడ్డు మీద నెట్టివేసే ప్రయత్నం చేయడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పెదబయలు మండల కార్యదర్శి కిల్లో సరబన్న, గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మ పృథ్వీరాజు సిఐటియు మండల అధ్యక్షులు
టి. రాజమ్మ, మండల నాయకులు వరహాలఅమ్మ తో పాటు అంగన్వాడీ టీచర్లు మరియు ఆయలు పాల్గొన్నారు.

పుంగనూరులో రైతుల సంక్షేమానికి అగ్రస్థానం – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

 

Tags: Anganwadis should be recognized as government employees

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page