అవినీతి అధికారులకు కొమ్ము కాస్తే,  ఆదివాసి ద్రోహులుగా మిగిలి పోతారు

0 10

-మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్
-ఈరోజు దీక్షలో మద్దతుగా తెలుగుదేశం & బిజెపి

 

విశాఖపట్నం ముచ్చట్లు:

- Advertisement -

విశాఖపట్నం జిల్లాఅవినీతి అధికారులను  కొమ్ము కాస్తే ఆదివాసి ద్రోహులుగా మిగిలిపోతారని *మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు.హుకుంపేట దీక్షలో ఆయన మాట్లాడుతూ:  ఆదివాసి ప్రాంతంలో అవినీతి అధికారులకు   కొమ్ము  కాస్తున్న ఎమ్మెల్యేలు ,ఎంపీలు   ప్రజాగ్రహానికి గురికాక తప్పదని , ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తే  ఈ ప్రభుత్వం  బస్మం అవటం ఖాయమని అన్నారు.  ఆదివాసుల సంక్షేమానికి చూడవలసిన మీరు ఆదివాసుల పై దాడులు సరికాదని ఇప్పటికైనా హుకుంపేట లో జరిగిన విషయం పై  అరుకు ఎమ్మెల్యే ఎంపీలు  మౌనం  వీడాలని అన్నారు. ఆదివాసి మహిళకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని ప్రత్యక్ష పోరాటంలో కూడా ముందుంటానని వారన్నారు .బిజెపి అరకు  పార్లమెంట్ అధ్యక్షులు పాంగి రాజా రావు మాట్లాడుతూ: హుకుంపేట లో ఆదివాసి మహిళ  పట్టా భూమి, కరెంటు మీటర్, ఇంటి పన్ను,  సర్వ హక్కులు కలిగి ఉన్న  ఆదివాసి మహిళా షాపుని హుకుంపేట మండల తాహసిల్దార్, వై వి కోటేశ్వరరావు మరియు విఆర్ఓ  మీసాల సింహాచలం  రెండు లక్షల రూపాయలు లంచం ఇవ్వలేదని అక్కసుతో ఆగమేఘాల మీద  వెళ్లి  సూర్య మణి గోపాల్ను నాలుగు గంటలు పోలీస్ స్టేషన్లో నిర్బంధించి  షాపు కూల్చిన అధికారులను తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు.

 

 

 

 

గత 17 రోజుల నుండి బాధితులు రోడ్డుమీద పచ్చి ప్రజా ప్రతినిధులు, అధికారుల చుట్టూ  తిరుగుతూ తమకు న్యాయం చేయమని ప్రాధేయ పడుతున్నా కూడా  కనీసం పట్టించుకోకపోవడం   ఇంతకీ   అరకు ఎమ్మెల్యే, ఎంపీలు ఈ రాష్ట్ర ప్రభుత్వం   ఎవరి కోసం పని చేస్తున్నారో ఇంతకీ ఈ ప్రభుత్వాం రాష్ట్రంలో ఉందా ..లేదో కూడా తెలియని పరిస్థితుల్లో  ఉందని   ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తే రానున్న రోజుల్లో ప్రజలే తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో లో   సెంట్రల్ సెన్సార్ మెంబర్ సల్ల రామకృష్ణ, అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షులు సరభ వేమన బాబు,  సీనియర్ నాయకులు రాజారావు మేండా రమణ , బిజెపి మండల అధ్యక్షుడు గాసన్న  తెలుగుదేశం పార్టీ  మండల అధ్యక్షులు తులసీరావు, సీనియర్ నాయకులు శెట్టి లక్ష్మణుడు, సర్పంచ్ల ఫోరం నాయకులు బాలురు వెంకటరమణ,  సత్యనారాయణ ,పాంగి పాండురంగ స్వామి సుమన్ కామేశ్వరరావు శ్యామ్ కృష్ణారావు కోటి, గిరిజన సంఘం మండల కార్యదర్శి టి కృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య విశాఖ జిల్లా సహాయ కార్యదర్శి కూడా రాధాకృష్ణ, సిపిఎం పార్టీ మండల నాయకులు సుడిపల్లి కొండలరావు, మహిళా నేతలు కంబిడి లిత కుమారి, రుడి రవణమ్మ, కే సరస్వతి, ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో రైతుల సంక్షేమానికి అగ్రస్థానం – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

 

Tags: If horned to corrupt officials, the tribals will be left as traitors

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page