కలెక్టర్ ను  కలిసిన నూతన ఎస్పీ విజయరావు

0 13

నెల్లూరు ముచ్చట్లు:

 

జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ను, జిల్లా ఎస్పీగా నూతన బాధ్యతలు స్వీకరించిన విజయ రావు పుష్పగుచ్ఛం తో మర్యాదపూర్వకంగా లాంఛనంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాకు ఎస్పీగా బదిలీ చేసిన రాష్ట్ర పోలీసు శాఖ, ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లాలో ఫ్రెండ్లీ పోలీస్ ద్వారా సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. గత సంవత్సర పైసలకు కంటికి కనిపించని కరోనా వైరస్ నేపథ్యంలో ఫ్రంట్లైన్ వారియర్స్ గా విధి నిర్వహణలో ఉన్న అనేక మంది పోలీసులు మరణించడం బాధాకరం అన్నారు. ముఖ్యంగా పోలీస్ వెల్ఫేర్ కు తన వంతు సహకారం అందిస్తామన్నారు. జిల్లాలో శాంతిభద్రతల నియంత్రణకు జిల్లా పోలీస్ శాఖ అధికారులు, ప్రజా సంఘాలు, సమాజం పట్ల గౌరవ మర్యాదలు ఉన్న అందరితోనూ కలిసికట్టుగా ఫ్రెండ్లీ పోలీస్ టీం ఏర్పాటుతో శాంతి భద్రతలు కాపాడేందుకు కృషి చేస్తామన్నారు. పోలీస్ శాఖలో కానిస్టేబుల్ నుండి  ఎస్ పి వరకు ప్రతి ఒక్కరూ తమ విధులను సక్రమంగా నెరవేరుస్తూ, ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించేందుకు ఒక ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ముఖ్యంగా నగరంలో ట్రాఫిక్ సమస్యపై దృష్టి పెడతామన్నారు. యాక్సిడెంట్ మరణాలు తగ్గించేందుకు తన వంతు సహకారం అందిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల భద్రత రక్షణ కై దిశ యాప్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ యాప్ ను ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా సూచించారు. శాఖాపరమైన సమావేశాల తో పాటు, క్రైమ్ మీటింగ్ ఏర్పాటు చేసి, జుడిషియల్  అధికారుల కోఆర్డినేషన్ తీసుకుంటామన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో రైతుల సంక్షేమానికి అగ్రస్థానం – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

Tags: The new SP Vijayarao who met the Collector

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page