కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గద్దేదింపడానికి ప్రజలు సిద్ధం

0 7

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను గడప, గడపకు తీసుకెళ్లాలి
అధికారమే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి
టిపిసిసి ప్రచారకమిటి కో కన్వీనర్ అజ్మత్  ఖాన్

జగిత్యాల ముచ్చట్లు:

 

 

- Advertisement -

ప్రజా, వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దే దింపడమే లక్ష్యంగా ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త సైనికుడిగా పనిచేయాలని టిపిసిసి ప్రచార కమిటీ కోకన్వీనర్ అజ్మత్ ఖాన్ పిలుపునిచ్చారు.సోమవారం పెంచిన పెట్రోల్, డీజిల్,గ్యాస్, నిత్యావసర ధరలకు నిరనసనగా పిసిసి పిలుపుమేరకు కాంగ్రెస్ నాయకులు జగిత్యాలలో ఎడ్ల బండ్లు, సైకిల్, రిక్షాలతో జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ నుంచి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అజ్మత్ ఖాన్ మాట్లాడుతూ ప్రజలచే ఎన్నుకోబడ్డ బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల కోసం పనిచేస్తుందని విమర్శించారు. అధికారంలోకి వచ్చినప్పటినుంచి 45 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన బిజెపి ప్రభుత్వం 50 లక్షల కోట్ల రూపాయలు ఆదాని, అంబానీలకోసం సంపాదించి పెట్టారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 2023 లో అధికారంలోకి రానుందని జోస్యం చెప్పారు.
కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు రాష్ట్రంలోని గడప, గడపకు తీసుకెళ్లి ప్రజలను చైతన్యంచేసి అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని అజ్మత్ ఖాన్ పిలుపునిచ్చారు.ఆనంతరం జగిత్యాలడీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి సామాన్యులపై భారం మోపిందని విమర్శించారు.

 

టీపీసీసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బండ శంకర్ మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయడమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలన్నారు. దేశ సమగ్రత కాంగ్రెస్ తోనే సాధ్యమని,రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమన్నారు.
కోరుట్ల నియోజకవర్గం ఇంచార్జీ జువ్వాడి నర్సింగరావు,కృష్ణా రావు మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ ధరలను జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.బతికేపల్లి సర్పంచ్ శోభారాణి మాట్లాడుతూ సిలిండర్ ధర వెయ్యి రూపాయలకు చేరబోతుందని, ప్రతీ మహిళా దీన్ని ప్రశ్నించాలన్నారు.నిరసన కార్యక్రమంలో నాయకులు జువ్వాడి కృష్ణారావు,తాటిపర్తి దేవేందర్ రెడ్డి, మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కళ్ళెపెల్లి దుర్గయ్య, కౌన్సిలర్ నక్క జీవన్,మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, గాజుల రాజేందర్, గాజంగి నందయ్య,సీరాజ్ ఉద్దిన్ మన్సూర్,కోర్టు శ్రీనివాస్,గిరి నాగ భూషణం ,చాంద్ ,అజార్ ,సొగ్రాభి, రామచంద్రా రెడ్డి, ముస్కు నిశాంత్ రెడ్డి, పులి రామ్, మహిపాల్ రెడ్డి, గంగాధర్, రవీందర్ రావు, లక్ష్మణ్, శంకర్,నేహాల్,కమల్ ,రాజేష్, గుండా మధు,ఏఆర్ అక్భర్ ,నాయిం ,తిరుమల గంగాధర్, మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా, కొమిరెడ్డి లింగారెడ్డి, జెట్టి లక్ష్మణ్, అరుణ్, డీజే అశోక్, గోనెల రాజేష్ ,ప్రవీణ్ , అవేజ్ ,హరీష్, కొమ్ముల, వెంకట్ రెడ్డి ,జుబేర్ ,మదర్ ఖాన్ ముజ్జు తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో రైతుల సంక్షేమానికి అగ్రస్థానం – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

 

Tags:Prepare the people to oust the central and state governments

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page