కౌశిక్ రెడ్డిపై క్రమశిక్షణా చర్యలు

0 15

హైదరాబాద్ ముచ్చట్లు:
కౌశిక్ రెడ్డి పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారని పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కోదండ రెడ్డి అన్నారు. కౌశిక్ రెడ్డి పై ఇప్పటికే జిల్లా కాంగ్రెస్ నుంచి అనేక పిర్యాదులు అందాయి. గతంలోనే కేటీఆర్ తో సాన్నిహిత్యంగా ఉన్న వీడియో వైరల్ అయ్యిందని అయన అన్నారు.అప్పుడే గాంధీభవన్ పిలిచి మండలించాం. అయినా ఆయన వైఖరిలో మార్పు రాలేదని అన్నారు. ఇప్పుడు తాజాగా మళ్లీ వైరల్ అవుతున్న ఆడియో లో కౌశిక్ టీఆర్ఎస్ తో అంతర్గత సంబంధాలు కలిగివున్నాడు అని తేలిపోయింది. కౌశిక్ రెడ్డి కీ షోకాజ్ నోటీసు ఇచ్చాం. 24 గంటల సమయంలో సమాధానం ఇవ్వాలని చెప్పాం. ఆయన సమాధానం సంతృప్తికరంగా లేకుంటే పార్టీ నుంచి బహిష్కరిస్తామని అయన అన్నారు. ..

 

పుంగనూరులో రైతుల సంక్షేమానికి అగ్రస్థానం – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

- Advertisement -

Tags:Disciplinary action against Kaushik Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page