గిరిజన మహిళలతో కలిసి టీకా

0 12

రంగారెడ్డి  ముచ్చట్లు:
తి ఒక్క‌రూ టీకా తీసుకోవాలి.. క‌రోనా నుంచి ర‌క్ష‌ణ పొందాలి అని రాష్ర్ట గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ పిలుపునిచ్చారు. మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని కేసీ తండాలో గ‌వ‌ర్న‌ర్ ఇవాళ ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా కేసీ తండాలో గ‌వ‌ర్న‌ర్ రెండో డోసు టీకా తీసుకున్నారు.ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు స‌మావేశంలో గ‌వ‌ర్న‌ర్ పూర్తిగా తెలుగులో ప్ర‌సంగించి అంద‌ర్నీ ఆక‌ట్టుకున్నారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం.. మీ అంద‌ర్ని క‌ల‌వ‌డం చాలా సంతోషంగా ఉంది. గిరిజ‌న‌ ప్ర‌జ‌లంటే త‌న‌కు చాలా అభిమానం, ప్రేమ అని చెప్పారు. గిరిజ‌న గ్రామాల్లో వ్యాక్సినేష‌న్ త‌క్కువ‌గా జ‌రుగుతోంద‌ని తెలిసింది. మీకంద‌రికి ధైర్యం చెప్పేందుకు కేసీ తండాకు వ‌చ్చాను. అంద‌రూ ధైర్యంగా వ్యాక్సిన్ తీసుకోవాలి. మ‌నంద‌రం వ్యాక్సిన్ తీసుకుంటే కొవిడ్‌ను జ‌యించొచ్చు. అంద‌రూ వ్యాక్సిన్ తీసుకోవాలి.. ఇతరుల‌కు కూడా వ్యాక్సిన్ తీసుకోవాల‌ని చెప్పాలి. నేను కేసీ తండాలో వ్యాక్సిన్ తీసుకొని విన్న‌పం చేస్తున్నాను.. అంద‌రూ వ్యాక్సిన్ తీసుకోని కొవిడ్ నుంచి ర‌క్ష‌ణ పొందాలి. అంద‌రూ త‌ప్ప‌కుండా మాస్కు ధ‌రించ‌డంతో పాటు భౌతిక దూరం పాటించాల‌న్నారు. త‌రుచూ చేతుల‌ను శానిటైజ‌ర్‌తో శుభ్రంగా క‌డుక్కోవాలి. కొవిడ్ నుంచి రక్ష‌ణ పొందాలి అని గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సూచించారు.

 

పుంగనూరులో రైతుల సంక్షేమానికి అగ్రస్థానం – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

- Advertisement -

Tags:Vaccination with tribal women

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page