జస్వంత్ రెడ్డి స్ఫూర్తి తో యువత బాధ్యతగా సైన్యంలో చేరాలి  గౌతమ బుద్ధ వాకర్స్ అసోసియేషన్ పిలుపు

0 12

నెల్లూరు ముచ్చట్లు:

నేటి తరానికి జశ్వంత్ రెడ్డి ఆదర్శప్రాయుడని  అతనిని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు, యువకులు సైన్యంలో చేర్చవలసిన అవసరం ఉందని గౌతమబుద్ధ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు అరవ జయ ప్రకాష్, రాయప్ప పిలుపునిచ్చారు  . స్థానిక గాంధీబొమ్మ సెంటర్ కి సమీపంలో ఉన్న స్వతంత్ర పార్కులో జస్వంత్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాశ్మీర్ రాజౌరి జిల్లా సుందర్బనీ సెక్టార్లో గురువారం రాత్రి జరిగిన ఉగ్రవాద దాడిలో   గుంటూరు జిల్లా బాపట్ల మండలం  దారి వాడా కొత్తపాలేనికి చెందిన 23 సంవత్సరాల  సైనికుడు  మరుప్రోలు జశ్వంత్ రెడ్డి   వీరమరణం పొందారని పేర్కొన్నారు .సందర్బంగా  స్వతంత్య్ర పార్కులో  సంతాప సభ ఏర్పాటు చేయడం గర్వంగా ఉందన్నారు. 17   సంవత్సరాల  వయసులోనే సైన్యంలో చేరిన   జశ్వంత్కు భారతదేశం ఘన నివాళులు అర్పిస్తున్న ఉందని జస్వంత్ రెడ్డి  త్యాగాన్ని, ధైర్యాన్ని, దేశం పట్ల ఆయనకున్న ప్రేమను కొనియాడారు. కొడుకును సైన్యంలోకి పంపిన అతని తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తున్నామని వారన్నారు  .నలందా విశ్వవిద్యాలయం, అయోధ్య కేదార్నాథ్ ఎన్ని   దేవాలయాలు ధ్వంసమైన  దాదాపు వెయ్యి సంవత్సరాలు దండయాత్రలు కొనసాగిన భారతదేశ సంస్కృతిని ఛిన్నాభిన్నం చెయ్యలేక  ప్రస్తుతం దొంగచాటు దాడులు నిర్వహిస్తున్న  ఉగ్రవాదులకు సరైన బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు . తమ బిడ్డలను తల్లిదండ్రులు డాక్టర్లు, యాక్టర్లు, నాయకులు, వ్యాపారస్తులు కావాలనే తరుణంలో తన కుమారుడిని దేశ రక్షణ కోసం సైన్యంలోకి పంపిన జస్వంత్ రెడ్డి తల్లిదండ్రుల లక్ష్యానికి యువతరం కట్టుబడి ఉండాలని కోరారు. జస్వంత్ రెడ్డి స్పూర్తితో యువత సైన్యంలో చేరాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జశ్వంత్ కుటుంబానికి 50 లక్షల ఆర్థిక సహాయం అందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కూరపాటి సతీష్, కొలపర్తి హజరత్, కొల్లపాక సురేష్, జి. వి నరసింహారావు, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో రైతుల సంక్షేమానికి అగ్రస్థానం – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

Tags:Inspired by Jaswant Reddy, the youth should join the army as a responsibility
Call of Gautama Buddha Walkers Association

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page