తెలంగాణ అంతటా వానలు… ఒకటి, రెండు రోజులు వానలంటున్న వాతావరణ శాఖ

0 13

హైదరాబాద్ ముచ్చట్లు:
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడ నం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళా ఖాతం దాని పరిసర ప్రాంతాలు ఉత్త రాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల్లో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాగల మూడు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు చాలా ప్రాంతాలో కురిసే అవకా శం ఉందని వాతావరణ శాఖ అధికారు లు తెలిపారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గురిజాల గ్రామ శివారు కాజ్‌వేలో ఒక యువకుడు వాగు దాటుతుండగా అందులో గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తి కోసం వెంటనే గాలింపు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.రాష్ట్రంలో జోరు వానలు కురుస్తున్నా యి. పలు జిల్లాల్లో కురిసిన తొలకరి జల్లులతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమ యం అయ్యాయి. అల్పపీడన ద్రోణి ప్ర భావంతో మరో మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వర్షాలకు పలు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తొలకరి జల్లులతో చెరువులు, కుంటలు నిండుతుండడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ సహా తెలంగాణాలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో మధ్యాహ్నం నుంచి భారీ వర్షంగా నమోదయ్యింది. సికింద్రాబాద్ , కూకట్‌పల్లి, కెపిహెచ్‌బీ, హైదర్‌నగర్, ఆల్విన్‌కాలనీ, నిజాంపేట్, ప్రగతినగర్, బాచుపల్లి, బాలానగర్, చింతల్, జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, కొంపల్లి, సుచిత్ర, కుత్బుల్లాపూర్, మాదాపూర్, కొండాపూర్, మణికొండ, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా రహదారులపై నీరు ఏరులైపారింది.రుతుపవనాల ప్రభావంతో కొద్దిరోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు నమోదవుతున్నాయని హైదరబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 13వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షానికి ఖానాపురం మండలం బుధరావుపేట వద్ద నేషనల్ హైవే విస్తరణ పనుల్లో భాగంగా బ్రిడ్జి నిర్మాణం వద్ద తాత్కాలికంగా వేసిన రోడ్డు కొట్టుకుపోవడంతో నర్సంపేట మహబూబాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల వద్ద ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండగా ఇప్పటికే తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలులతో ఉపరితల ద్రోణి 2.1 కిమీ ఎత్తులో ఏర్పడి ఉండడంతో అల్పపీడనం మరింత బలపడి భారీ ఉరుములు, మెరుపులతో తెలం గాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని అధికారులు తెలిపారు. రాగల రెండు రోజులపాటు వాతావరణం ఇలాగే ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.రానున్న మూడు రోజుల పాటు రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జనగామ, సిద్దిపేట, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ అర్బన్, రూరల్, వికారాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల్లో అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, హైదరాబాద్‌లో తేలిపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అల్పపీడనం ఉత్తర దిశగా వెళ్లే అవకాశం ఉందని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఉత్తర ఈశాన్య జిల్లా అధిక వర్షపాతం నమోదుకాగా, సుమారుగా ఈ జిల్లాల్లో 13 సెం.మీ వర్షపాతం నమోదయ్యిందని ఆమె తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు అత్యధికంగా 40 శాతం కన్నా ఎక్కువే వర్షపాతం నమోదయ్యిందని ఆమె తెలిపారు. జూన్‌లో 50 శాతం వర్షపాతం నమోదు కాగా జూలైలో ఇప్పటి వరకు 40 శాతం కంటే ఎక్కువే నమోదయ్యిందని ఆమె పేర్కొన్నారు.
వరంగల్‌లో జోరు వాన
వరంగల్‌లో వర్షం జోరుగా కురిసింది. హన్మకొండ, కాజీపేట, వరంగల్ నగరంలోని తదితర ప్రాంతాలలో కుండపోతగా వర్షం కురిసింది. జంట నగరాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. మురికి కాలువలు పొంగి పొర్లాయి. రోడ్లు, కాలనీలు నీట మునిగాయి. రోడ్ల పక్కన ఉన్న దుకాణంలోకి వరద నీరు చేరింది. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మేయర్ గుండు సుధారాణిలు పలు ప్రాంతాల్లో తిరిగి వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజల కోసం టోల్ ఫ్రీ నెంబర్‌లను అధికారులు ఏర్పాటు చేశారు.  వరంగల్ గ్రామీణ జిల్లాలోనూ భారీ వర్షం కురుస్తోంది. ఈదురు గాలులతో కూడిన వాన పడుతోంది. నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, పర్వతగిరి, ఐనవోలు గ్రామాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉదయం 7 గంటలనుంచి నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురవడంతో వర్ధన్నపేట బస్టాండ్‌లోకి వర్షపు నీరు చేరి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు, ల్లందు, కామేపల్లిల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇల్లందులో 19.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న వానతో బొగ్గు ఉత్పత్తి పనులకు అంతరాయం ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా నమోదయిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ అర్భన్‌లో 113.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, జనగాంలో 94.8, యాదాద్రి భువనగిరిలో 65.3, కరీంనగర్‌లో 60.3, వరంగల్ రూరల్‌లో 140, భద్రాద్రి కొత్తగూడెంలో 54.8, కరీంనగర్‌లో 96.8, రాజన్న సిరిసిల్ల 118.5, నిజామాబాద్‌లో 107.5, నాగర్‌కర్నూల్ జిల్లాలో 120.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

 

పుంగనూరులో రైతుల సంక్షేమానికి అగ్రస్థానం – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

- Advertisement -

Tags:Rains across Telangana …
One or two days of rainy weather

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page