పుంగనూరులో రైతుల సంక్షేమానికి అగ్రస్థానం – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

0 200

పుంగనూరు ముచ్చట్లు:

 

 

రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ వారిని అన్ని విధాల ఆదుకునేందుకు వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అగ్రస్థానం కల్పించిందని మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని బండ్లపల్లె, ఏతూరు ఆర్‌బికెలలో రైతు భరోసా చైతన్యయాత్రలు ఏవో సంధ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్వహిస్తున్న శాఖ ద్వారా ఆర్‌బికెల నిర్మాణం జరుగుతోందన్నారు. రైతులకు అవసరమైన సూచనలు, సలహాలతో పాటు ఎరువులు, విత్తనాలు రైతుల ముంగిటనే పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలు చేపట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి , మాజీ జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌, సర్పంచ్‌ జయప్రద, ఎంపిటిసిలు శివ, భాస్కర్‌రెడ్డి, పార్టీ నాయకులు చంద్రారెడ్డి యాదవ్‌, గురివిరెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి, చెంగారెడ్డి, సుధాకర్‌రెడ్డి, ధనుంజయరెడ్డి తదొతరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

దేశం లో 97.22 శాతానికి పెరిగిన క‌రోనా రిక‌వ‌రీ రేటు

Tags: Top for farmer welfare in Punganur – Akkisani Bhaskarreddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page