పుంగనూరులో వైఎస్‌ఆర్‌ చేయూత లభ్ధిదారులకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వాలి -కమిషనర్‌ కెఎల్‌.వర్మ

0 39

పుంగనూరు ముచ్చట్లు:

 

 

వైఎస్‌ఆర్‌ చేయూత లబ్ధిదారులకు బ్యాంకర్లు రుణాలు మంజురు చేసి వారిని ఆదుకోవాలని కమిషనర్‌ కెఎల్‌.వర్మ కోరారు. సోమవారం ఆయన బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. కమిషనర్‌ మాట్లాడుతూ చేయూత ద్వారా లబ్ధిపొందిన ప్రతి ఒక్కరికి రూ.56,250 లు రుణాలు మంజూరు చేయాలన్నారు. అలాగే సంఘాలకు రుణాలు మంజూరు చేయడంలో ఆలస్యం చేయవద్దని కోరారు. పిఎం స్వనిధి ద్వారా కూడ లభ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వదేశాల మేరకు లబ్ధిదారులకు సహకారం అందించి, వారి అభివృద్ధికి చేయూతనివ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెప్మా ఏపిఎం రవి, అకౌంట్స్ ఆఫీసర్‌ మనోహర్‌, బ్యాంక్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో రైతుల సంక్షేమానికి అగ్రస్థానం – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

 

Tags: Bankers should give loans to YSR beneficiaries in Punganur – Commissioner KL Verma

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page