పెట్రోల్, డీజీల్ ధరలకు వ్యతిరేకంగా నిరసనలు

0 9

హైదరాబాద్ ముచ్చట్లు:

 

పెట్రో ధరల పెంపుపై తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్‌ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. స్థానిక నాయకులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరసనల్లో పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ ధర్నాచౌక్ లో సైకిల్ ర్యాలీ, ఎడ్లబండితో నిరసన తెలిపారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, గీతా రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ఫిరోజ్ ఖాన్ తో పాటు పలువురిని పోలీసులు చేశారు.
ఖమ్మం జిల్లా: పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎడ్లబండిపై కాంగ్రెస్ కార్యాలయం నుంచి ధర్నాచౌక్ వరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ర్యాలీ నిర్వహించారు.నల్గొండ జిల్లా: పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్, మాజీ ఎమ్మెల్యే బాలూ నాయక్ పాల్గొన్నారు. ఎడ్లబండిని లాగి జగ్గారెడ్డి నిరసన తెలిపారు.

 

- Advertisement -

పుంగనూరులో రైతుల సంక్షేమానికి అగ్రస్థానం – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

Tags:Protests against petrol and diesel prices

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page