పెరిగిన పచ్చదనం

0 17

నల్గొండ ముచ్చట్లు:

 

యాదాద్రి జిల్లా పరిధిలోని రాయగిరి సమీపంలో ఉన్న ఆంజనేయ అరణ్యంలో అటవీ పునర్జీవ చర్యల్లో భాగంగా గుట్టల ప్రాంతంలో (నాటిన సెర్మోనియల్ / రాకీ) ప్లాంటేషన్ ను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి పరిశీలించారు. అనంతరం వారు అక్కడ  మొక్కలు నాటారు. తెలంగాణలో క్షీణించిన అడవుల పునరుద్దరణ, పచ్చదనం పెంచాలనే సిఎం కెసిఆర్ హరిత సంకల్పానికి అనుగుణంగా హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటుతున్నామని వారు తెలిపారు. హరితహారం కార్యక్రమం వల్ల పర్యావరణంపై ప్రజల్లో అవగాహన పెరిగిందని వారు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల రాష్ట్రంలో 4 శాతం పచ్చదనం పెరిగిందని వారు చెప్పారు. పర్యావరణ సమతుల్యతోనే జీవకోటి మనుగడ సాధ్యమవుతుందని వారు స్పష్టం చేశారు. అడవుల పునర్జీవం, ప్రత్యామ్నాయ అడవుల పునరుద్దరణ, హరితహారం కార్యక్రమాల వల్ల యాదాద్రి – భువనగిరి జిల్లాలో పచ్చదనం పెరిగిందని, యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం పునఃప్రారంభం తర్వాత ఈ ప్రాంతం మరింత శోభను సంతరించుకుంటుందని వారు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే, గొంగిడి సునిత మహేందర్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ళ శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ క్రిష్ణా రెడ్డి, జడ్పి ఛైర్మెన్ సందీప్ రెడ్డి, అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శోభ, కలెక్టర్ పమెలా సత్యవతి, స్థానిక ప్రజా ప్రతినిధులు , సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు కర్రె వెంకటయ్య యాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు జనగాం పాండు, గుట్ట మున్సిపల్ ఛైర్మెన్ ఎరుకల సుధా, ఆలేర్ మార్కెట్ కమిటి ఛైర్మెన్ రవీందర్, తదితరులు ఉన్నారు.

- Advertisement -

పుంగనూరులో రైతుల సంక్షేమానికి అగ్రస్థానం – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

Tags:Increased greenery

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page