ప్రజారోగ్యమే ఎమ్మెల్యే ధ్యేయం

0 88

రామసముద్రం ముచ్చట్లు:

 

ప్రజారోగ్యమే మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా ధ్యేయమని కెసిపల్లి సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి అన్నారు. సోమవారం కెసిపల్లి పంచాయతీ పరిధిలోని వై.కురప్పల్లి గ్రామంలో బ్లీచింగ్ పౌడర్ పిచికారి చేశారు. అలాగే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, స్థానిక శాసన సభ్యులు నవాజ్ బాషాల ఆదేశాల మేరకు పంచాయతీలో కరోనపై అవగాహన కల్పించారు. అలాగే కరోన భారిన పడిన వారికి పలు జాగ్రత్తలు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోన భారిన పడిన వారు అధైర్య చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా సకాలంలో స్పందించాలని ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్ బాషాలు అధికారులను ఆదేశించారన్నారు. అదే విధంగా ఎంపీ, ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు పంచాయతీలో నమోదు అవుతున్న కరోన కేసుల వివరాలు తెలుసుకుని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారన్నారు. ప్రజలు కూడా అనవసరంగా బయట తిరక్కుండా భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు బాబు, ఎల్లారెడ్డి, శివకుమార్, విటి.జయచంద్ర, ఎల్. మునస్వామి, వెంకటరమణ, నాగరాజ, వాలింటర్ మేఘన తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో రైతుల సంక్షేమానికి అగ్రస్థానం – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

Tags; Public health is the goal of the MLA

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page