ప్రజా ఆరోగ్యానికే అధిక ప్రాధాన్యత- సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి

0 111

రామసముద్రం ముచ్చట్లు:

 

 

ప్రజా ఆరోగ్యానికే ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కెసిపల్లి సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి అన్నారు. సోమవారం స్థానిక సచివాలయంలో రెండవ విడత కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంతో ఉంటే అంతకన్నా మహాత్బుగ్యంగా ఉంటారని వైకాపా ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం కరోన వ్యాధిని ఆరోగ్యశ్రీలోకి చేర్చారన్నారు. కరోన మహమ్మారి వల్ల పేద కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదని ప్రత్యేకంగా వైద్యశాలలను ఏర్పాటు చేశారన్నారు. అంతేకాకుండా మదనపల్లి శాసన సభ్యులు నవాజ్ బాషా కూడా ప్రజారోగ్యం కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ప్రజలందరూ కరోన మహమ్మారికి గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. కరోన ప్రబలకుండా నివారించడం కోసం 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరూ కరోన వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, ఏఎన్ఏం సుగుణమ్మ, డిజిటల్ అసిస్టెంట్ భారతమ్మ, వెల్పేర్ అసిస్టెంట్ ఉపేంద్ర, మహిళా పోలీస్ గౌతమి, స్థానిక నేతలు బాబు, ఎల్లారెడ్డి, మునస్వామి, జయచంద్ర, వెంకటరమణారెడ్డి, ఆశ వర్కర్లు మంజుల, రాధమ్మ, వాలింటర్లు రెడ్డెమ్మ, దినకర్, కుమారస్వామి, రామచంద్ర, ప్రదీప్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో రైతుల సంక్షేమానికి అగ్రస్థానం – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

Tags: High priority is given to public health – Sarpanch Srinivasureddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page