బోనాలనై మంత్రి తలసాని సమీక్ష

0 9

హైదరాబాద్  ముచ్చట్లు:
బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సాలార్జంగ్ మ్యూజియం లో ఆగస్టు 1 వ తేదీన నిర్వహించనున్న ఓల్డ్ సిటీ బోనాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులు, ఉత్సవాల నిర్వహకులతో సమీక్షను మంత్రి  నిర్వహించారు. ఉత్సవాల కోసం మొత్తం 90 కోట్ల రూపాయలు కేటాయించాం. ఏర్పాట్ల కోసం 75 కోట్లు, వివిధ ఆలయాలకు 15 కోట్ల ఆర్ధిక సహాయం అందజేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం బోనాల ఉత్సవాలకు ముందే ఆలయాలకు ఆర్ధిక సహాయం పంపిణీ జరగనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి KCR ఆధ్వర్యంలో ప్రజలు అన్ని పండుగలను ఘనంగా జరుపుకుంటున్నారు. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టడం జరిగింది. కరోనా నేపధ్యంలో భక్తులు, ఉత్సవాల నిర్వహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని  మంత్రి అన్నారు.

 

పుంగనూరులో రైతుల సంక్షేమానికి అగ్రస్థానం – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

- Advertisement -

Tags:Bonalanai Minister Talasani Review

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page