భయపెడుతున్న జికా వైరస్

0 36

హైదరాబాద్ ముచ్చట్లు:

 

క‌రోనావైర‌స్ ఉధృతి ఇంకా పూర్తిగా తగ్గ‌నే లేదు ! సెకండ్ వేవ్ క‌ల్లోలం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాం !! ఇలాంటి స‌మ‌యంలో మ‌రో వైర‌స్ భ‌య‌పెట్టిస్తోంది. కేర‌ళ‌లో వ్యాపిస్తున్న జికా వైర‌స్ ఇప్పుడు భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేస్తుంది. తిరువ‌నంత‌పురం జిల్లా ప‌ర‌స్స‌ల గ్రామానికి చెందిన 24 ఏళ్ల గ‌ర్భిణికి జికా వైర‌స్ సోకిన‌ట్లు ఆరోగ్య శాఖ అధికారులు నిర్ధారించారు. ఆమెకే కాదు.. తిరువ‌నంత‌పురం జిల్లాకు చెందిన 13 మంది డాక్ట‌ర్లు, ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల్లో జికా వైర‌స్ ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లు అనుమానిస్తున్నారు. దీంతో వైర‌స్ నిర్ధార‌ణ కోసం శాంపిల్స్ సేక‌రించి పుణె వైరాల‌జీ ల్యాబ్‌కు త‌ర‌లించారు. ఈ క్ర‌మంలో అప్ర‌మ‌త్త‌మైన ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం జికా వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా జాగ్ర‌త్తలు తీసుకుంటుంది.డెంగ్యూ, మ‌లేరియా మాదిరి జికా వైర‌స్ కూడా దోమ‌ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ప్ర‌ధానంగా ఈడెస్ దోమ‌లు ఈ జికా వైర‌స్ వ్యాప్తికి వాహ‌కాలుగా ప‌నిచేస్తాయ‌ని వైద్యులు చెబుతున్నారు. అలాగే లైంగికంగా కూడా ఈ వైర‌స్ సంక్ర‌మించే అవ‌కాశం ఉంది. అవ‌య‌వ‌దానం, ర‌క్త‌దానంతో కూడా జికా వైర‌స్ వ్యాప్తి చెందుతుంది. గ‌ర్భిణుల‌కు ఈ వైర‌స్ సోకితే పుట్ట‌బోయే పిల్ల‌లు మైక్రోసెఫాలి ల‌క్ష‌ణంతో పుడ‌తారు. అంటే సాధార‌ణంగా కంటే త‌ల భాగం చిన్న‌గా ఉంటుంది.జికా వైర‌స్ సోకిన వారిలో సాధార‌ణంగా క‌నిపించే మొద‌టి ల‌క్ష‌ణం జ్వ‌రం.

 

 

 

 

- Advertisement -

దాని త‌ర్వాత చ‌ర్మంపై ద‌ద్దుర్లు, త‌ల‌నొప్పి, క‌ళ్లు ఎర్ర‌బ‌డ‌టం, కండ‌రాల నొప్పులు, కీళ్ల నొప్పులు వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఈ ల‌క్ష‌ణాలు రెండు మూడు రోజుల నుంచి వారం వ‌ర‌కు ఉంటే క‌చ్చితంగా అనుమానించాల్సిందే.జికా వైర‌స్ నుంచి ర‌క్ష‌ణ కోసం ఎలాంటి వ్యాక్సిన్ గానీ మందు గానీ లేదు. ఈ వైర‌స్ ప్ర‌ధానంగా దోమ‌ల ద్వారా వ్యాపిస్తుంది. కాబ‌ట్టి దోమ‌కాటు నుంచి ర‌క్ష‌ణ పొందేలా త‌గు జాగ్ర‌త్తలు తీసుకోవాలి. పొడ‌వాటి డ్రెస్సులు వేసుకోవాలి. దోమ తెర‌లు వాడాలి. ఇంటి ప‌రిస‌రాల్లో నీరు చేర‌కుండా చూసుకోవాలి. ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాలి. వీలైనంత వ‌ర‌కు ఫ్యాన్ గాలి కింద ఉండాలి. దోమ‌కాటు నుంచి ర‌క్ష‌ణ క‌ల్పించే క్రీములు కూడా వినియోగించ‌వ‌చ్చు.జికా వైర‌స్ నిర్ధార‌ణ కోసం ర‌క్త‌, మూత్ర ప‌రీక్ష‌లు చేస్తారు. అలాగే ప్ర‌ధానంగా పీసీఆర్ టెస్ట్ చేస్తారు. జికా వైర‌స్‌కు స‌రైన చికిత్స అంటూ ఏమీ లేదు. రోగి ల‌క్ష‌ణాల‌ను బ‌ట్టి చికిత్స అందిస్తారు. రోగికి విశ్రాంతి చాలా అవ‌స‌రం. వీలైనంత ఎక్కువగా నీరు తాగాలి. జ్వ‌రం త‌గ్గ‌డానికి పారాసిట‌మ‌ల్ ట్యాబ్లెట్ వాడొచ్చు.జికా వైర‌స్‌ను మొద‌ట 1947లో ఉగాండా అడ‌వుల్లోని కోతుల్లో గుర్తించారు. 1952లో మ‌నుషుల్లో ఈ వ్యాధిని గుర్తించారు. ఆ త‌ర్వాత‌ ఆఫ్రిక‌న్ దేశాల‌తో పాటు ఆసియా దేశాలైన భార‌త్‌, ఇండోనేసియా, మ‌లేసియా, ఫిలిప్పీన్స్‌, థాయిలాండ్‌, వియ‌త్నాం దేశాల్లో ప్ర‌బ‌లింది. ఇక 2016, 2017 స‌మ‌యంలో గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌లో అత్య‌ధిక కేసులు న‌మోద‌య్యాయి. జికా వైర‌స్‌ను ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో ) 2016లో ప‌బ్లిక్ హెల్త్ ఎమ‌ర్జెన్సీగా ప్ర‌క‌టించింది.

పుంగనూరులో రైతుల సంక్షేమానికి అగ్రస్థానం – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

Tags: The frightening Zika virus

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page