మొక్కలు నాటిన సీఎం మనవడు

0 21

హైదరాబాద్ ముచ్చట్లు:
సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్ష్ రావు పుట్టినరోజు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు హిమాన్ష్. తన బాబాయి , గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రగతి భవన్ లో మొక్కలు నాటారు హిమాన్షు. హిమాన్షు మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు, హరితహారం కార్యక్రమంలో అందరు కూడా భాగస్వాములై మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. దీని ద్వారా పర్యావరణ పరిరక్షణకు అందరు పాటుపడి, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలన్నారు.
సంవత్సరం హిమాన్షుకు ప్రత్యేకమైన జన్మదిన మన్నారు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్. హిమాన్షుకు ఇటీవలే ప్రతిష్టాత్మక డయానా అవార్డు దక్కిన విషయం తెలిసిందే. తాను దత్తత తీసుకున్న రెండు గ్రామాల్లో కల్తీ లేని ఆహారం కోసం గొప్ప కార్యక్రమం చేపట్టి విజయవంతంగా అమలు చేసినందుకు హిమాన్షుకు డయానా అవార్డు వచ్చింది. హిమాన్షు కు ఈ సంవత్సరం ఎంతో గొప్పది అని…అదే విధంగా తన పుట్టినరోజు సందర్భంగా తనతో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం చాలా సంతోషకరమైనదన్నారు ఎంపీ సంతోష్. భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాక్షించారు.

 

పుంగనూరులో రైతుల సంక్షేమానికి అగ్రస్థానం – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

- Advertisement -

Tags:Grandson of the CM who planted the plants

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page