రాజన్నఆలయం కు కరోనా తాకిడి

0 18

వేములవాడ  ముచ్చట్లు:
వేములవాడ రాజన్నల ఆలయాల ప్రాంతంలో కరోనా న మరోమారు విజృభించింది. ఇప్పటికే కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయం కు వచ్చే భక్తులతో కాళేశ్వరం గ్రామం కరోన వ్యాధి సోకి మళ్ళీ కంటెంట్మెంట్ జోన్ గా మారింది. సోమవారం నుంచి  ఆలయాన్ని మూసేశారు. ఈ విషయం తెలుసుకున్న వేములవాడ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.  తెలంగాణ లోనే అతి పెద్ద ఆలయం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అలయంకు నిత్యం వేలాది మంది భక్తులు, సోమవారం నాడు లక్షలాది భక్తులు వస్తున్నారు. లాక్ డౌన్ ఉన్న సమయం లో వేములవాడ ప్రాంతం కరోన కట్టుదిట్టంగా ఉండే,  ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తేసిన తరువాత ఈ క్షేత్రంకు భక్తుల రాకతో మల్లి కరోన వ్యాధి విజ్రమిస్తుందని ప్రజలు భయాందోళకు గురవుతున్నారు.  ఇప్పటికే కాళేశ్వరం లో మరల కరోనా తీవ్రస్థాయిలో విజృంభించి కేవలం కాళేశ్వరం గ్రామంలోనే 100 కి పైన పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఇట్టి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అక్కడి కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 10 నుండే కాళేశ్వరం గ్రామాన్ని కంటోన్మెంట్ జోన్ గా మారిపోయింది. కాళేశ్వరం దేవస్థాన దర్శనం, ప్రాజెక్టు సందర్శన మరియు అస్తికలు కలుపుటలపై తాత్కాలిక నిషేదించారు. ఈ విషయం తెలువగాని వేములవాడ ఆలయంలో పని చేసే ఉద్యోగులు, పట్టణ ప్రజలు భయపడుతున్నారు. కాళేశ్వరం కన్న వేములవాడ క్షేత్రానికి అధిక శాతం భక్తులు వస్తుంటారు, అధిక శాతం భక్తులు రావడంతో కారోన కట్టడిని గాలికి వదిలేసి మాస్కులు లేకుండా, భౌతిక దూరం పాటించకుండా, శానిటైజేర్ వాడకుండా ఆలయంలో, పట్టణంలో భక్తులు సంచరిస్తున్నారు. ఎక్కడెక్కడో రాష్ట్రాల వారు ఇక్కడికి రావడం తో పట్టణ ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైన కాళేశ్వరం మాదిరిగా వేములవాడ అలయమును మూసివేయాలని, మా ప్రాణాలను కాపాడాలని వేములవాడ వాసులు వేడుకున్నారు. లేని పక్షంలో పట్టణ వాసులందరు రొడెక్కి ధర్నాకు దిగనున్నారు.

 

పుంగనూరులో రైతుల సంక్షేమానికి అగ్రస్థానం – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

- Advertisement -

Tags:Corona collision to Rajanna Temple

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page