వాహనాలపై పెండింగ్ చలానాలు చెల్లించాలి;- ట్రాఫిక్ ఎస్సై కమలాకర్

0 18

పెద్దపల్లి  ముచ్చట్లు:

వాహనాలపై పెండింగ్  చలానాలు ఉన్నట్లయితే వెంటనే చెల్లించాలని, లేనట్లయితే ప్రత్యేక తనిఖీలలో వాహనాన్ని స్వాదినపరుచుకుంటామని తెలిపారు. ట్రాఫిక్ ఎస్సై కమలాకర్ హెచ్చరించారు. సోమవారం ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు ఎస్సై తన సిబ్బందితో కలిసి గోదావరిఖని పట్టణంలోని రాజేష్ థియేటర్ వద్ద  చలానాలు ఎక్కువగా ఉన్న వాహనాల మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పెండింగ్  చలానాలు ఎక్కువగా ఉన్న వాహనాలను ఆపి చలానాలు చెల్లించిన తర్వాత  వాహనదారులకు ట్రాఫిక్ నియమ నిబంధనల గురుంచి అవగాహన కల్పించి వదిలిపెట్టారు. చలానాలు చెల్లించని వాహనాలను స్వాధీన పరుచుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ వాహనాలపై పెండింగ్ చలానాలను మీ సేవ, నెట్ బ్యాంకింగ్, పేటియం ద్వారా వెంటనే చెల్లించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ చలానాలకు, ప్రమాదాలకు దూరంగా ఉండాలని తెలిపారు. ఈ తనిఖీలలో ఏఎస్సై సురేష్, కానిస్టేబుల్స్ భార్గవ్, లక్ష్మణ్, హోంగార్డ్ మహేందర్ పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో రైతుల సంక్షేమానికి అగ్రస్థానం – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

Tags:Pay pending motions on vehicles; – Traffic Essay Kamalakar

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page