వేద విజ్ఞాన ఫ‌లాల‌ను స‌మాజానికి అందించాలి -టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి

0 17

-ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం 15వ ఆవిర్భావ దినోత్స‌వం

 

తిరుమల ముచ్చట్లు:

 

 

 

- Advertisement -

శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద విశ్వ‌విద్యాల‌యంలో ప‌రిశోధ‌న‌ల‌ను విస్తృతం చేసి వేదాల్లోని విజ్ఞానాన్ని స‌మాజానికి అందించాల‌ని టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి కోరారు. తిరుప‌తిలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద విశ్వ‌విద్యాల‌యం 15వ ఆవిర్భావ దినోత్స‌వం సోమ‌వారం వ‌ర్సిటీ ప‌రిపాల‌నా భ‌వ‌నంలో ఘ‌నంగా జ‌రిగింది.ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అద‌న‌పు ఈవో మాట్లాడుతూ వేదవిద్య క్లిష్ట‌మైన‌ద‌ని, విద్యార్థులు ఎంతో సాధ‌న చేస్తేగానీ ఇందులో రాణించ‌లేర‌ని చెప్పారు. స‌మాజాన్ని స‌న్మార్గంలో న‌డిపించేందుకు దోహ‌ద‌పడే వేదవిద్య‌ను బాధ్య‌త‌గా భావించాల‌న్నారు. విద్యార్థులు వేద విద్య‌ను ప‌రిపూర్ణంగా సాధ‌న చేసి మంచి భాష‌తో ప్ర‌వ‌చ‌నాలిచ్చే స్థాయికి ఎద‌గాల‌ని సూచించారు. విద్యార్థుల చేత వారానికోసారి ప్ర‌సంగాలు ఇప్పించి సాధ‌న చేయించాల‌న్నారు.పూర్వ‌కాలంలో వేదాల్లో 1331 శాఖ‌లుండేవ‌ని, దేశంలోని పాల‌నా ప‌రిస్థితుల కార‌ణంగా చాలాకాలం పాటు భార‌తీయులు వాటికి దూర‌మ‌య్యార‌ని అన్నారు. ప్ర‌స్తుతం 9 వేద శాఖ‌లు మాత్ర‌మే అందుబాటులో ఉన్నాయ‌ని, వీటిలో దాగి ఉన్న సైన్స్ ర‌హ‌స్యాల‌ను వెలికితీయాల‌ని కోరారు. సూర్య‌మండ‌లం, న‌వ‌గ్ర‌హాలు, భూగోళం లాంటి అంశాలను శాస్త్రవేత్త‌లు మ‌న‌కు తెలుప‌కముందే వేదాల్లో ఉన్నాయ‌న్నారు. వేద‌శాఖ‌ల్లోని అన్ని మంత్రాల‌ను అర్థ‌తాత్ప‌ర్యాల‌తో స‌ర‌ళ‌మైన వ్య‌వ‌హారిక భాష‌లో అందించాల‌ని కోరారు. ఎస్వీబీసీలో వేదాల వ్యాప్తికి ప్రాముఖ్య‌త ఇస్తున్నామ‌ని, ఇప్ప‌టివ‌రకు ప్ర‌సార‌మైన యోగ‌వాశిష్టం-విషూచిక మ‌హామంత్ర పారాయ‌ణం, సుంద‌ర‌కాండ‌, విరాట‌ప‌ర్వం, గీతాపారాయ‌ణం కార్య‌క్ర‌మాల‌కు భ‌క్తుల నుండి విశేష‌స్పంద‌న ల‌భించింద‌న్నారు. వ‌ర్సిటీ పండితులు ముందుకొస్తే వారి ప్ర‌వ‌చ‌నాల‌ను ఎస్వీబీసీ ద్వారా ప్ర‌సారం చేస్తామ‌న్నారు.

 

 

 

 

 

విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి ఆచార్య స‌న్నిధానం సుద‌ర్శ‌న‌శ‌ర్మ మాట్లాడుతూ వ‌ర్సిటీ ఆవిర్భావం, ప్ర‌స్థానం గురించి తెలియ‌జేశారు. వేదాల‌ను ప‌రిపూర్ణంగా అర్థం చేసుకుని, పారాయ‌ణం చేసి, వేదభాష్యం చెప్ప‌గ‌లిగే పండితుల‌ను వ‌ర్సిటీ త‌యారు చేస్తోంద‌న్నారు. వేద‌పండితుల‌కు స‌ముచిత‌మైన గౌర‌వం, అవ‌కాశాలు ల‌భించేందుకు వీలుగా కంప్యూట‌ర్, గ‌ణితం, ఆంగ్లం ప్ర‌వేశ‌పెట్టిన‌ట్టు చెప్పారు. డిగ్రీస్థాయిలో వేద‌గ‌ణితం, వేదిక్ ఫిజిక్స్‌, సంస్కృతంలో డిగ్రీ, పిజి కోర్సులు, జ‌ర్మ‌న్ భాష‌లో స‌ర్టిఫికేట్ కోర్సులు ఇటీవ‌ల ప్ర‌వేశ‌పెట్టామ‌న్నారు. వేదాల‌ను ప‌రిశోధించి, ప్రచురించ‌డం ద్వారా వేదాల్లోని మంచి విష‌యాల‌ను ప్ర‌జ‌ల‌కు అందిస్తున్నామ‌న్నారు.ఇరామానుశ‌నూట్రన్దాది పుస్తకం, వ‌ర్సిటీ న్యూస్‌లెట‌ర్‌ ఆవిష్క‌ర‌ణవర్సిటీలోని ప‌రిశోధ‌న మ‌రియు ప్ర‌చుర‌ణ‌ల విభాగం ముద్రించిన ఇరామానుశ‌నూట్రన్దాది అనే పుస్త‌కాన్ని, వేద‌సుర‌భి పేరుతో న్యూస్‌లెట‌ర్‌ను అద‌న‌పు ఈవో ఆవిష్క‌రించారు. ఇరామానుశ‌నూట్రన్దాది(ప్ర‌బంధర‌క్షా వ్యాఖ్యానువాద స‌హితం) అనే పుస్త‌కం నాళాయిర దివ్య‌ప్ర‌బంధంలోని పాశురాల‌కు వ్యాఖ్యానం. టిటిడి ఆళ్వార్ దివ్య‌ప్ర‌బంధ ప్రాజెక్టు విశ్రాంత ప్ర‌త్యేకాధికారి  శింగ‌రాచార్యులు ఈ ప్ర‌బంధ ర‌క్షా త‌మిళ వ్యాఖ్యానాన్ని య‌థాత‌థంగా తెలుగులోకి అనువ‌దించారు.

 

 

 

 

 

శాస్త్రోక్తంగా సుద‌ర్శ‌న హోమం

వ‌ర్సిటీ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా వ‌ర్సిటీ అభివృద్ధి, లోక‌క్షేమాన్ని కాంక్షిస్తూ ఉద‌యం యాగ‌శాల‌లో శాస్త్రోక్తంగా సుద‌ర్శ‌న హోమం, న‌వ‌గ్ర‌హ హోమం, న‌వ‌గ్ర‌హ పూజ నిర్వ‌హించారు. ఆచార్య శ్రీ‌నివాసాచార్యులు ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, ఉప‌కుల‌ప‌తి ఆచార్య స‌న్నిధానం సుద‌ర్శ‌న‌శ‌ర్మ, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.ఈ కార్య‌క్ర‌మంలో ఎస్వీబీసీ సిఈవో జి.సురేష్‌కుమార్‌, వ‌ర్సిటీ అక‌డ‌మిక్ డీన్  జివి.సుబ్ర‌హ్మ‌ణ్య శ‌ర్మ, ఆచార్యులు  ప‌వ‌న‌కుమార శ‌ర్మ, ఇత‌ర ఆచార్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

పుంగనూరులో రైతుల సంక్షేమానికి అగ్రస్థానం – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

Tags: The results of Vedic knowledge should be made available to the society – TTD Addition Evo AV Dharmareddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page