3 వ రోజుకు చేరిన యానాదులు గిరిజనుల ధర్నా

0 8

– ఐటీడీఏ పీవో పై విచారించి చర్యలు చేపడతామన్న కలెక్టరేట్ ఏవో

 

నెల్లూరు   ముచ్చట్లు:

 

- Advertisement -

ఐటిడిఎ పిఓ పై చట్టరీత్య తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదుట యానాదులు గిరిజన నాయకులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం సోమవారం తో 3వ రోజుకు చేరుకుంది. ఈ  క్రమంలో కలెక్టర్ కార్యాలయం లోకి చొచ్చుకు పోయేందుకు ఆందోళన కారులు  ప్రయత్నించారు. వీరి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఉద్రిక్తత గమనించిన కలెక్టర్ కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీక్షా శిబిరం వద్దకు వచ్చి సంబంధిత  ఆందోళన దారులతో చర్చించిన కలెక్టరేట్ ఎఓ, ఐటిడిఎ పిఓ పై విచారణ జరిపి చట్ట రీత్యా తగిన చర్యలు తీసుకునేందుకు  కలెక్టర్తో మాట్లాడదామని హామీ  ఇచ్చారు. ఈ సందర్భంగా యానాదుల గిరిజన నాయకులు మాట్లాడుతూ ఐటీడీఏ పీవో పై అధికారిక చర్యలు తీసుకునే వరకూ దీక్షలు కొసాగుతాయని ఎఓ కి స్పష్ణం చేయడమైనది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెసి పెంచలయ్య, జిల్లా అధ్యక్షులు బి ఎల్ శేఖర్, ప్రధాన కార్యదర్శి రాపూరు కృష్ణయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇండ్లరవి, కోశాధికారి సుబ్రమణ్యం,  మహిళానాయకులు లక్ష్మి, సునంద, రవణమ్మ, జ్యోతి, యువజన విభాగం నాయకులు రమేష్, లక్ష్మణ్, చెంచురామయ్య, మురళీ, గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఏకోల్లు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో రైతుల సంక్షేమానికి అగ్రస్థానం – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

Tags: The elephants reached the 3rd day of the tribal dharna

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page