ఆ డ్రైవర్ కు సన్మానం

0 18

రంగారెడ్డి  ముచ్చట్లు:
సోమవారం  రాజేంద్రనగర్ పిఎస్ పరిధిలోని పివిఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వేపై కారులో మంటలు చెలరేగి మంటలు ఎగిసి పడుతుండగా కారులోని తల్లి కూతుళ్ళను ప్రాణలకు తెగించి కాపాడిన డ్రైవర్ రవికి  రాజేంద్రనగర్ ఎసిపి ఆఫీసులో సన్మానం జరిగింది.  ఎసిపి శివ ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు. ప్రమాదంనుంచి తప్పించుకున్న  శైలజ తనను, తన ఇద్దరు చిన్నారులను రవి ప్రాణాలకు తెగించి కృతజ్ఞతలు తెలిపింది. శైలజ  సిఐఎస్ఎఫ్ లో కానిస్టేబుల్ గా పని చేస్తుంది. మామిడి పల్లిలో నివాసముంటూ  తన చిన్నారులు అనారోగ్యంతో ఉండడంతో గచ్చిబౌలి బయలుదేరుతుంగా పివి ఎక్స్ ప్రెస్ వేపై ప్రమాదం జరిగింది. తనను తన పిల్లలను కాపాడిన రవి పేరును చిన్నారికి పెడితే బాగుంటుందని ఎసిపి శైలజకు సూచించారు. చిన్నారులతో సహ తల్లిని కాపాడిన దృశ్యాలు నాకు కలలో వచ్చాయని రవి తెలిపాడు. నేను కాపాడిన విషయాన్ని  నా భార్యతో  చెప్పాను. అందుకు నా భార్య చాలా సంతోషం వ్యక్తం చేసిందని తెలిపాడు. ఈ రోజు నాకు సన్మానం చేసిన దాని కంటే వారిని కాపాడడం సంతోషంగా ఉందని రవి తెలిపాడు. శైలజ మాట్లాడుతూ  మామిడిపల్లి నుండి బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్ వెళ్లుండగా పివి ఎక్స్ ప్రెస్ వేపై ఎక్కగానే కారులో నుండి పోగలు రావడం జరిగింది. పోగలను గమనించి కారును అపేసి కిందకు దిగడంతో ఇద్దరులు పిల్లల్లో ఒకరిని కారులో నుండి బయటకు తీసాను. మరో బాబు కారులో ఉండడంతో మెహిదిపట్నం వైపు నుండి మరో కారులో వస్తున్న డ్రైవర్ రవి  కాపాడాడు. ఈ రోజు నేను నా పిల్లలు ప్రాణలతో ఉన్నామంటే రవి అని అందరి ముందు కన్నీరు మున్నీరైంది. ప్రమాదంలో కాపాడిన రవిని దేవుడితో పోల్చి,  మా పాలిట దేవుడిలా వచ్చాడని అమె తెలిపారు.

పుంగనూరులో రైతుల సంక్షేమానికి అగ్రస్థానం – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

 

- Advertisement -

Tags:Tribute to that driver

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page