ఈ నెల 16 న కౌశిక్ రెడ్డి తెరాసలో చేరిక

0 11

కరీంనగర్‌  ముచ్చట్లు:
హుజూరాబాద్‌ కేంద్రంగా కరీంనగర్‌ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఆది, సోమవారాల్లో చోటు చేసుకున్న పరిణామాలు ఊహించని మలుపులు తిరిగాయి. హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి పాడి కౌశిక్‌ రెడ్డి ఫోన్‌ సంభాషణలు లీక్‌ అయిన వెంటనే వేగంగా పావులు కదిలాయి. కౌశిక్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయడం, టీఆర్‌ఎస్‌లోకి వెళ్లేందుకు ముహూర్తం నిర్ణయించుకోవడం జరిగిపోయింది.ఈ నెల 16న హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్‌ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో కౌశిక్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకోబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక ఇటీవల టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, తెలంగాణ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఎల్‌.రమణ సోమవారం టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేతుల మీదుగా పార్టీ సభ్యత్వం తీసుకున్న విషయం తెలిసిందే.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

- Advertisement -

Tags:Kaushik Reddy joins Teresa on the 16th of this month

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page